హైదరాబాద్: నమ్మశక్యంగా లేనప్పటికీ, ఇది నిజమే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల సింగపూర్ వెళ్ళినపుడు ఆయనకు అక్కడి రాయబార కార్యాలయం ఒక ఏర్పాటు చేసిందట. ఆ కారు డ్రైవర్‌కు చంద్రబాబు టిప్ ఇవ్వబోయారట. అయితే ఆ కారు డ్రైవర్ ఆ టిప్‌ను తిరస్కరించాడట. ఈ విధంగా ఎవరైనా డబ్బులు తీసుకుంటే, వారు దేశంలో రోడ్లపై మళ్ళీ కనిపించరనికూడా చెప్పాడట. సింగపూర్‌లో అవినీతిని పరీక్షించటంకోసం తానీవిధంగా చేశానని చంద్రబాబు ఇటీవల ఐటీ పారిశ్రామికవేత్తలతో జరిగిన ఒక సదస్సులో చెప్పారు. సింగపూర్‌లో ఎవరైనా ఇలాంటి తప్పు చేస్తే వారికి శిక్ష తప్పదని వెల్లడించారు. ఒక సందర్భంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జోక్యం చేసుకున్నా తప్పుచేసినవ్యక్తికి అధికారులు దండన విధించారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఒకేరకంగా ఉంటారని, ఆలోచనా ధోరణులుమాత్రం భిన్నంగా ఉంటాయని అన్నారు. సింగపూర్ ఒక అద్భుతమైన దేశమని, తప్పులు ఎవరుచేసినా అక్కడ దండన తప్పదని చంద్రబాబు చెప్పారు.
ఇంకా నయం! నోటు ఇవ్వజూపినందుకు చంద్రబాబును పట్టుకోలేదు సింగపూర్ పోలీసులు! అసలే ఇక్కడ ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని బాధపడుతున్నారు.