టాలీవుడ్లో అందరి కళ్లూ… జనతా గ్యారేజ్ పైనే. టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలతో ఫామ్ లోకి వచ్చిన ఎన్టీఆర్… శ్రీమంతుడుతో బ్లాక్‌బ్లస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివతో జోడీ కట్టగానే… అందరి ఫోకస్ ఈ సినిమాపై పడింది. దానికి తోడు జనతా గ్యారేజ్ అనే టైటిల్, మోహన్‌లాల్ లాంటి ఆర్టిస్టుల అండ దొరకడం, ఇటీవల విడుదల చేసిన టీజర్… యూ ట్యూబ్‌లో సంచలనాలు సృష్టించడం వెరసి.. జనతా గ్యారేజ్‌పై హైప్ పెరిగిపోంతోంది. దాంతో బయ్యర్లు ఈ సినిమా కోసం క్యూ కట్టడం మొదలెట్టారు. ఇప్పుడు శాటిలైట్ రేటు కూడా అదిరిపోయింది. మా టీవీ జనతా గ్యారేజ్ శాటిలైట్ హక్కుల్ని రూ.12.5 కోట్లకు జేజిక్కించుకొన్నట్టు టాక్. ఎన్టీఆర్ కెరీర్లో శాటిలైట్‌కి ఈ స్థాయిలో ధర పలకడం ఇదే తొలిసారి. దీన్ని బట్టి జనతా గ్యారేజ్ హైప్ ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవొచ్చు. నైజాం రేటుకూడా భారీగానే పలికింది. ఎన్టీఆర్ కెరీర్లో హయ్యస్ట్ ధర అది. ఇలా అన్ని వైపుల నుంచీ.. ఈసినిమాకి మంచి రేటే వస్తోంది. జనతా గ్యారేజీ సినిమాకి బడ్జెట్ పెరిగిపోయిందని, ఎన్టీఆర్ మార్కెట్‌కి మించి ఖర్చు చేశారన్న వార్తలు వినవొచ్చిన నేపథ్యంలో ఈ రాబడి చూస్తే… ఖర్చు పెట్టడంలో తప్పు లేదనిపిస్తోంది కదూ. ప్రస్తతుం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబరు 2న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.