ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణంలో కీలకమైన సిఆర్డిఎ (క్రిడా) కమిషనర్ శ్రీకాంత్‌ను మార్చి ్ చెరుకూరి శ్రీధర్‌ను క్రిడా కొత్త కమిషనర్‌గా తీసుకురావడంలో చాలా రాజకీయం కనిపిస్తుంది. క్రిడాను ఏర్పాటు చేసిన తరువాత తొలి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్‌ను శిక్షణ కోసం పంపించి . తిరిగొచ్చిన తర్వాతనేమో సాధారణ పరిపాలనశాఖ పొలిటికల్ సెక్రటరీగా నియమించారు. నిజానికి రాజధాని ప్రక్రియ మొదలైనప్పటి నుండి ఇప్పటివరకూ ముగ్గురు కీలక అధికారులు – దొండపాటి సాంబశివరావు, గిరిధర్ ఆర్మానే, కమిషనర్ శ్రీకాంత్‌లు అలా మారిపోయారు. ఫలితంగా ఇప్పుడు రాజధాని నిర్మాణ ప్రక్రియపై మంత్రి నారాయణ మాత్రమే సమగ్రంగా సాధికారికంగా మాట్లాడగలరని అంటున్నారు. శ్రీకాంత్ ే మార్పు దగ్గరగా పరిశీలించేవారికి ఆశ్చర్యం కలిగించలేదు. రాజకీయ ఒత్తిళ్ల మధ్య తాను నలిగిపోతున్నట్టు క్రిడా కమిషనర్ అనేక సందర్భాల్లో ఆవేదన చెందుతున్నట్టు తెలిసింది.వివాదాస్పదమైన చాలా నిర్ణయాలు అమలు బాధ్యత ఆయనపై పడింది. ప్రాజెక్టు రూపకల్పన ప్లానింగ్, భూ సమీకరణ, పరిహారం తదితర విధివిధానాల రూపకల్పన ఆయనతోనే చేయించారు. ఆఖరుకు సిఆర్డిఎ పరిధిలో జీవో విడుదల చేయాలంటే ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కమిషనర్‌ను సంప్రదించాలంటూ ప్రభుత్వం అత్యున్నత అధికారాలు కట్టబెట్టింది. గ్రామసభల నిర్వహణ, రైతులకు నచ్చజెప్పడం, ఉద్యోగులను పూర్తిస్థాయిలో పనిలోకి దించడం అన్నీ ఆయన పేరిటే జరిగాయి.. అయితే క్లిష్టమైన కీలకమైన ల్యాండ్ఫూలింగు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇదంతా మారింది. కావలసినవన్నీ చేయించుకున్నాక ప్రభుత్వ పెద్దలే ఆయనపై చిరాకులు మొదలెట్టారు. ఆయన వల్లే రాజధానిలో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని మంత్రులు వ్యాఖ్యలు చేశారు. తప్పులు సమస్యలు శ్రీకాంత్పైకి తోసేసి బదిలీ చేయడానికే ఇదంతా జరుగుతున్నదని పరిశీలకులు పసిగట్టకపోలేదు. తీవ్ర విమర్శలు వచ్చాయి. రోడ్ల ప్లానింగ్‌లోనూ, మార్పులు, చేర్పుల్లోనూ,పరిహారం పంపిణీ విషయంలో అవకతవకలకు సంబంధించి కూడా శ్రీకాంతే స్వయంగా నిర్ణయం తీసుకున్నారని మంత్రులు తప్పుకున్నారు. గ్రామకంఠాలపై నిర్ణయం తీసుకోకపోవడానికి శ్రీకాంతే కారణమని మంత్రి స్వయంగా ప్రకటించి ప్రస్తుత కమిషనర్‌గా నియమించిన శ్రీధర్‌కు అప్పగించారు. అసలు ే సమీకరణ ప్రక్రియ అనంతరం తుళ్లూరు నామమాత్రంగా మారిపోయింది.సీన్ విజయవాడకు మారింది. ప్రభుత్వం అధికారులను, నిర్వహణ ప్రక్రియను పూర్తి నామమాత్రంగా మార్చేసింది. కీలక అధికారులెవరినీ పూర్తి స్థాయిలో విధులు నిర్వహించనీయలేదు. ఇక కమిషనర్ మారిపోయారు కొత్తగా వచ్చిన వారికి సమయం కావాలి అనే సమాధానం ఇవ్వడానికే ఇదంతా జరిగిందనే భావన బలంగా వినిపిస్తున్నది. ఈలోగా నారాయణ ఆధ్వర్యంలోే కీలకమైన నిర్ణయాలన్నీ జరిగిపోతుంటాయి.