మాటల మాంత్రికుడిగా పేరొందిన త్రివిక్రమ్… దర్శకుడిగా తన విశ్వరూపాన్ని ఎప్పటికప్పుడు చూపిస్తూనేఉన్నాడు. అయితే… త్రివిక్రమ్ అభిమానులంతా దర్శకుడి కంటే, రచయితగానే ఎక్కువ మార్కులేస్తారు. ఇప్పుడు ఆ రచయితకే కరువొచ్చి పడింది. అ.ఆ కోసం తొలిసారి బయట కథ వాడుకొన్నాడు త్రివిక్రమ్. ఇప్పుడు మరోసారి కథని అప్పు తీసుకొంటున్నట్టు టాక్. సెప్టెంబరులో పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే… ఈ కథ త్రివిక్రమ్‌ది కాదట. పవన్ సొంతంగా రాసుకొన్న కథట. దానికి మార్పులు, చేర్పులూచేసి త్రివిక్రమ్ తన స్టైల్‌కి అడాప్ట్ చేసుకొంటున్నాడన్నమాట. సర్దార్ గబ్బర్‌సింగ్‌కీ పవన్ రచయితగా వర్క్ చేశాడు. ఆసినిమా తేలిపోయింది. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తున్నాడన్నమాట. డాలీ, బాబీ లాంటి దర్శకులకు మాట సాయమో, కథ సాయమో చేయొచ్చు.మాటల మాంత్రికుడికీ అంతేనా.?? త్రివిక్రమ్ లాంటి దర్శకుడి దగ్గరైనా… పవన్ ఈ తరహా జోక్యం తగ్గించుకొంటే బాగుంటుందేమో? లేదంటే… సర్దార్ లాంటి డిజాస్టర్లు తగులుతూనే ఉంటాయి.