హైదరాబాద్: వరల్డ్ బాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో సైనా నెహ్వాల్ పరాజయం పాలయింది. వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్ కరోలినా మారిన్ చేతిలో ఆమె రెండు వరుస సెట్లలో 21-16, 21-19 స్కోరుతో ఓడిపోయింది. ఫైనల్ మ్యాచ్లో మొదటినుంచీ కరోలినాదే పైచేయిగా ఉంది. రెండవ సెట్లో సైనా కొంత ముందంజలోకి వచ్చినా కరోలినా డిఫెన్స్ ఆడుతూ దూసుకెళ్ళింది. సైనా ఈ మ్యాచ్లో గెలిచి ఉంటే ఎన్నో రికార్డ్లు సృష్టించి ఉండేది. అయినా రజత పతకం రావటంకూడా సామాన్య విషయంకాదనేది గుర్తుంచుకోవాల్సిన విషయం.