చిరంజీవి 150వ సినిమా కోసం రైటర్లు బాగానే శ్రమిస్తున్నారు. ఆల్రెడీ ఇదో తమిళ కథ. దాన్ని పరుచూరి బ్రదర్స్ బాగా సానబెట్టారు. ఆకుల శివ ఓ చేయి వేశాడు. క్లైమాక్స్ సీన్లు బుర్రా సాయిమాధవ్ రాశారు. ఇప్పుడు మరో రైటర్ వచ్చి చేరారు. ఆయనే… సత్యానంద్. రచయితగా సుదీర్ఘ అనుభవం సంపాదించుకొన్న వ్యక్తి సత్యానంద్. చిరంజీవి కీ కొన్ని సూపర్ హిట్లు ఇచ్చారాయన. తాజాగా.. చిరు 150వ సినిమా కోసం ఓ హ్యాండు వేస్తున్నారు. కొన్ని కీ సీన్స్‌కి సంబంధించి ఆయన పెన్ను కదిలిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే రైటర్లు ఎక్కువైపోయారు మొర్రో.. సినిమా ఏమవుతుందో అని మెగా ఫ్యాన్స్ బెంగ పెట్టుకొన్నారు. ఇప్పుడు ఈయనా చేరాడన్నమాట.
ఇవన్నీ చూస్తుంటే చిరు మరీ అతి జాగ్రత్తకు పోతున్నారేమో అనిపిస్తోంది. ఒకరిద్దరిపై నమ్మకం ఉంచలేక… అందరికీ ఒక్కో పార్టు అప్పగించడం వల్ల కొత్త సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడుతుందన్నట్టు… రైటర్లు ఎక్కువైతే సినిమా భవిష్యత్తే మారిపోతుంది. మరి అది పాజిటివా? నెగిటివా? అన్నది కాలమే సమాధానం చెప్పాలి.