హిట్ కాంబినేషన్ కి ఉండే క్రేజ్ ప్లాప్ కాంబినేషన్‌కి ఎందుకుంటుంది. పైగా భయం. యాంటీ సెంటిమెంట్ భయపెట్టేస్తూ ఉంటుంది. అయినా సరే.. ఓ ఫ్లాప్ జంటతో మరో సినిమా రెడీ అవుతోంది. శౌర్య సినిమాలో తొలిసారి జంటగా నటించారు మనోజ్, రెజీనా. ఇప్పుడు వీళ్లిద్దరితో మరో సినిమా తెరకెక్కుతోంది. అజయ్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం వైజాగ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. జూనియర్ ఆర్టిస్టుల ఏజెంట్లతో మనోజ్, చిత్రబృందం గొడవపడింది ఈసినిమా షూటింగ్‌లోనే. అన్నట్టు ఈ సినిమాకి ‘ఒక్కడు మిగిలాడు’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. యాక్షన్ ప్యాక్డ్ లవ్ స్టోరీ అట. ఇందులో ఓ ప్రముఖ కథానాయకుడు కీ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ పాత్ర ఎవరికి దక్కుతుందో చూడాలి. తాజాగా ఈ సినిమాపై వివాదరం ఏర్పడిన నేపథ్యంలో చిత్రబృందం షూటింగ్‌ని రద్దు చేసుకొని హైదరాబాద్ తిరిగొచ్చేస్తోంది. మళ్లీ కొత్త షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. ఈ గొడవ సద్దుమణిగే వరకూ షూటింగ్ మొదలెట్టే ప్రసక్తి లేదని తెలుస్తోంది.