తెలుగు తెరపై పొరుగు హీరోయిన్లదే హవా. ముంబైతో పాటు కేరళ హీరోయిన్లు చాలా మంది టాప్ పొజిషన్ లో ఉన్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ హీరోగా ఓ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. ఇందుతో దీప్తి సతి అనే అందాల నటి హీరోయిన్ గా నటిస్తోంది.
జాగ్వార్ అనే ఈ సినిమా టీజర్ మొన్న ఆదివారం హైదరాబాద్ లో విడుదలైంది. ఆన్ లైన్లో సందడి చేస్తోంది. ఇందులో హీరోయిన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ముంబైలో పుట్టి పెరిగిన దీప్తి సతి తల్లి స్వరాష్ట్రం కేరళ. కాలేజీ రోజుల నుంచే ఆమెకు మోడలింగ్ పై ఆసక్తి. 2012లో మిస్ కేరళ టైటిల్ గెల్చుకుంది.
ఆ తర్వాత నేవీ క్వీన్ 2103 కిరీటాన్ని గెల్చుకుంది. 2014 ఫెమీనా మిస్ ఇండియా ఈవెంట్ లో రెండు అవార్డులు సొంతం చేసుకుంది. ఇండియన్ ప్రిన్సెస్ 2014లో ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది. గ్లామర్ ప్రపంచంలో తళుక్కుమన్న ఈ బ్యూటీ, ఓ మలయాళ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. 2015లో నీ-నా అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం జాగ్వార్ అనే ద్విభాషా చిత్రంలో నటిస్తోంది. దీన్ని కన్నడ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్నారు.
హీరో నిఖిల్ తండ్రి కుమారస్వామే ఈ సినిమా నిర్మాత. 60 కోట్ల బారీ బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తున్నారని ఫిలిం నగర్ టాక్. ఈ సినిమా హిట్లయితే తెలుగులోనూ బిజీ హీరోయిన్ గా మారవచ్చని దీప్తి ఆశిస్తోంది. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ జాగ్వార్ మీదే ఉన్నాయి.