ఏ సినిమాకైనా బడ్జెట్ పరిధుల్లో ఉండడం ముఖ్యం. ఎంతలో పూర్తవ్వాల్సిన సినిమా అంతలో పూర్తయితేనే నిర్మాతకు శ్రేయస్కారం. బడ్జెట్ ఎప్పుడు దాటిందో కష్టాలు అప్పుడు మొదలవుతాయి. `మనమంతా` సినిమాకి ఇప్పుడు అదే జరిగింది. మోహన్‌లాల్, గౌతమి కలసి నటించిన చిత్రమిది. చంద్రశేఖర్ యేలేటి దర్శకుడు. ఈ సినిమా రూ.8 కోట్ల బడ్జెట్‌తో పూర్తవ్వాలన్న లక్ష్యంతో మొదలైందట. కానీ బడ్జెట్ క్రమంగా పెరుగుతూ వచ్చిందని టాక్. చివరికొచ్చేసరికి ఈ సినిమాకి రూ.17 కోట్లయ్యాయట. మోహన్‌లాల్ ఉన్నాడు కాబట్టి మలయాళంలో ఈ సినిమాకి క్రేజ్ ఉంటుందని చిత్రబృందం నమ్మకం. అన్ని చోట్లా వారాహి సంస్థే స్వయంగా విడుదల చేసుకొంటోంది. అంటే.. ఈ సినిమా రూ.17 కోట్ల బెట్టింగ్ అన్నమాట. వస్తే.. డబ్బులు వచ్చినట్టు, లేదంటే లేదు. తెలుగులో ఈ సినిమాని అమ్ముకొందామని సాయి కొర్రపాటి భావించారు. కానీ.. ఎవ్వరూ కొనడానికి ముందుకు రాలేదు. మనమంతా ప్రచారం కూడా చప్పగా సాగుతోంది. ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు ఏం లేవు. కనీసం ఆడియో ఫంక్షన్ కూడా చేయలేదు. చంద్రశేఖర్ యేలేటికి ఇది వరకు కమర్షియల్ హిట్సేం లేవు. మోహన్‌లాల్ బొమ్మ చూసి సినిమాకొచ్చే సీన్ తెలుగులో అయితే లేదు. అయినా ఏధైర్యంతో పబ్లిసిటీ చేయడం లేదో??? డబ్బులన్నీ సినిమాకే అయిపోయాయి, ఇక పబ్లిసిటీకి ఏం పెడతామని నిర్మాత భావిస్తున్నాడేమో. ఇలాగైతే ఈ సినిమా చేయిదాటిపోయినట్టే.