ఆదిత్య 369కి సీక్వెల్ చేయాలన్నది నందమూరి బాలకృష్ణ ఆలోచన. అయితే ఆయనకే షాకిచ్చిన సినిమా… ఆటాడుకొందాం రా. సుశాంత్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఇప్పుడు బాలయ్య అభిమానుల్లో అనేక సందేహాల్ని లేవనెత్తుతోంది. ఆదిత్య 369లానే ఈసినిమా కూడా ఉండబోతోందన్నది వాళ్ల ఆందోళనకు కారణం. ఆటాడుకొందాం రాకి సంబంధించిన టీజర్ లేటెస్టుగా విడుదలైంది. దాంతో టైమ్ మిషన్ అనే ఎపిసోడ్ ఉంది. ఆ మిషన్‌లోకి వెళ్తే 50 సంవత్సరాలు ముందుకు గానీ, వెనక్కిగానీ వెళ్తారట. అంటే.. సేమ్ టూ సేమ్ ఆదిత్య 369 కాన్సెప్టే కదా? ఈ పాయింట్‌ని కామెడీకి వాడుకొంది చిత్రబృందం. ఆదిత్య పాయింట్‌ని లేపేస్తే.. త్వరలో సీక్వెల్ చేయడానికి ఇబ్బంది ఎదురవుతుంది. అదే నందమూరి ఫ్యాన్స్ ఆందోళనకు కారణం.
చిత్రబృంద కూడా టీజర్లో టైమ్ మిషన్ కాన్సెప్ట్నే హైలెట్ చేసింది. అయితే అది కేవలం కామెడీ ఎపిసోడ్ అని.. బ్రహ్మానందాన్ని బకరాగా చేయడానికి ఆ కాన్సెప్ట్ వాడుకొన్నారని తెలుస్తోంది. కేవలం కామెడీ ట్రాక్ కోసమైతే ఓకే అనుకోవొచ్చు. ఫుల్ లెంగ్త్ మూవీ అయితేనే… ఆదిత్య 999కి ఇబ్బంది ఎదురవుతుంది. ఆ కమెడీ ట్రాక్ ఎంతలా పండిందో తెలియాలంటే ఆగస్టు 18 వరకూ ఆగాలి. ఎందుకంటే ఆటాడుకొందాం రా సినిమా అప్పుడే రిలీజ్ అవుతుంది. ఈనెల 5వ తేదీన పాటల్ని విడుదల చేస్తారు.