ఇదేదో రైమింగ్ కోసం పెట్టిన టైటిల్ కాదు. బాబు బంగారం సినిమాలో నయన తార క్యారెక్టరైజేషన్ అంతకంటే కాదు. బాబు బంగారం టీమ్‌కి నయనతార లైవ్‌లో నరకం చూపించేస్తోంది. అందుకే అలా అన్నాం. బాబు బంగారం సినిమా ఆలస్యమైందంటే దానికి కారణం నయనతారే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లెద్దు. షూటింగ్‌లకు కాల్షీట్లు ఇచ్చి మరీ.. డుమ్మా కొట్టేసేదట నయన. సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఎక్కడుందో చెప్పకుండా టెన్షన్ పెట్టేదట. దాంతో ఆ సినిమా దర్శక నిర్మాతలకు బీపీ రేజింగులోకి వెళ్లిపోయేదట. బాబు బంగారం ఫినిషింగ్ స్టేజీలో ఉంది. చిన్న చిన్న ప్యాచ్ వర్కులు చేయాలి. కానీ నయనతార రావడం మానేసిందట. నయన వల్ల ఓ పాటని కూడా షూట్ చేయలేదని, ఆడియోలో ఉన్న ఓ గీతం సినిమాలో కనిపించదని తెలుస్తోంది.
నయనతార సంగతి తెలుగు చిత్రసీమకు బాగా తెలుసు. వెంకీకి ఇంకా అనుభవం ఉంది. ఎందుకంటే నయనతో వెంకీ రెండు సినిమాల్లో నటించాడు. అయినా నయనతారనే ఎందుకు తీసుకొన్నారు? అని అడిగితే.. వెంకీ – నయన జంటగా ఇది వరకు రాధా అనే చిత్రం మొదలైంది. కానీ.. సడన్‌గా ఆడిపోయింది. ఆ తాలుకూ అడ్వాన్సులు రాబట్టుకొనేందుకు నయనతారతో సినిమా తీయడం మినహా మరో మార్గం లేకపోయింది చిత్రబృందానికి. ఒకసారి అడ్వాన్సు తీసుకొంటే తిరిగిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది నయన. ఆబ్లికేషన్ కొద్దీ ఈ సినిమా చేయడానికి ఒప్పుకొంది. అందుకే నయన ఇంత నరకం చూపిస్తున్నా చిత్రబృందం కామ్‌గా భరిస్తోంది. నయన తారకు తెలుగులో అవకాశాలు రాకపోవడానికి ఆమె ప్రవర్తిస్తున్న విధానం కూడా ఓ కారణమని చిత్ర వర్గాలు చెప్పుకొస్తున్నాయి.