ఇండ్రస్ట్రీలో ఓ కొత్త జోకు షికారు చేస్తోంది. అదీ.. పవన్ కల్యాణ్ సినిమా గురించి. డాలీతో తీస్తున్న తన కొత్త సినిమాని నాలుగు నెలల్లో పూర్తి చేసి.. జనవరిలో సినిమా రిలీజ్ చేయమని పవన్ ఆర్డరు వేశాడట. ఒకవేళ ఆయన ఆర్డరు నిజంగానే వేశాడనుకోండి. అంతకంటే జోకు ఇంకోటి ఉండదు గాక ఉండదు. ఎందుకంటే పవన్ ఎంత స్లోనో ఆయన అభిమానులకు కూడా తెలుసు. సర్దార్ గబ్బర్‌సింగ్ విడుదలై… ఇంతకాలమైనా ఆయన సినిమాకి రంగం సిద్ధమైనా ఇప్పటి వరకూ సెట్స్‌పైకి వెళ్లిందే లేదు. అయితే పవన్ మాత్రం తన సినిమాని సంక్రాంతి బరిలో నిలపాలని చూస్తున్నాడన్న టాక్ బయటకు వచ్చేసింది. పవన్‌కు ఆ ఉద్దేశం ఉన్నా… ఈ సినిమా సంక్రాంతికి రావడం అసాధ్యమే.
పవన్ బేసిగ్గా మూడిస్ట్. తనకు నచ్చితే సెట్స్ కి వెళ్తాడు లేదంటే లేదు. చుట్టూ ఎక్కువ మంది ఉన్నారంటే డైలాగులు చెప్పడట. ఈ విషయాన్ని పవనే స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇక డాన్సులు సరే సరి. పవన్ సినిమా మొదలెట్టాడంటే పూర్తయి బయటకు రావడానికి కనీసం యేడాది పడుతుంది. ఇంతకంటే తక్కువ టైమ్‌లో సినిమా పూర్తి చేసిన సందర్భం ఇన్నేళ్ల కెరీర్లో ఒకటీ అరా ఉంటాయేమో… అంతే. పైగా ఇప్పుడు పొలిటికల్‌గానూ పవన్ బిజీ అవుదామనుకొంటున్నాడు. ఈ నేపథ్యంలో నాలుగు నెలల్లో సినిమా పూర్తి చేయడం కష్టం. చిరు, బాలయ్య సినిమాలు రెండూ సంక్రాంతికి వద్దామని ప్రిపేర్ అవుతున్నాయి. పైగా షూటింగ్ కూడా ఎంతో కొంత జరిగింది కూడా. ఈలోగా మధ్యలో పవన్ వచ్చి.. సినిమా పూర్తి చేసేద్దాం అంటే ఎట్టా?? పవన్ – డాలీ సినిమా మార్చిలో విడుదలైనా గొప్పే. కాదంటారా..??