కేథరిన్ జాక్ పాక్ కొట్టేసింది. అల్లు అర్జున్ సినిమాలో మళ్లీ ఛాన్స్ అందుకొంది. ఇద్దరమ్మాయిలు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కేథరిన్. ఆ తరవాత బన్నీతోనే సరైనోడులో కనిపించింది. ఇప్పుడు అల్లు అర్జున్ – హరీష్ శంకర్ సినిమాలోనూ కేథరిన్‌ని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా దిల్‌రాజు ఓ సినిమాని నిర్మించనున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తారు. ఇందులో ఇద్దరు కథానాయికలకు చోటుంది. ఓ కథానాయికగా కేథరిన్‌ని తీసుకొన్నార్ట. సరైనోడు బాగా ఆడినా.. ఎమ్మెల్యేగా కేథరిన్ క్యారెక్టర్ పండినా.. కేథరిన్ కెరీర్‌కి పెద్దగా హెల్ప్ అవ్వలేదు. ఆ సినిమా తరవాత మరో ఛాన్స్ అందుకోలేకపోయింది కేథరిన్. ఆ సంగతి తెలిసి మరీ… బన్నీ కేథరిన్ పేరు ప్రపోజ్ చేశాడట. అయితే మెయిన్ హీరోయిన్ కోసం హంటింగ్ కొనసాగుతూనే ఉంది. ఈ పాత్ర కోసం సమంత, శ్రుతిహాసన్, పూజా హెగ్డే పేర్లు పరిశీలించారు. కానీ.. డేట్లు సర్దుబాటు కాకపోవడం వల్ల ఎవ్వరూ ఓకే అవ్వలేదు. ఇప్పుడు తమన్నా పేరు పరిశీలిస్తున్నారు. కథానాయిక ఎవరో సెట్టయిపోతే.. ఈ సినిమా పట్టాలెక్కడానికి మార్గం సుగమం అయినట్టే. మరి ఆ ఆన్వేషణ ఎప్పుడు పూర్తవుతుందో?