కుటుంబ ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకొన్న కథానాయకుడు వెంకటేష్. ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించడం ఎలాగో ఆయనకు బాగా తెలుసు. ఆయన టైటిళ్లు కూడా కుటుంబ ప్రేక్షకులకు, మహిళలకు నచ్చేలా ఉంటాయి. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే… అంటూ అలరించిన వెంకీ.. ఇప్పుడు మళ్లీ అలాంటి టైటిల్‌తో అలరించబోతున్నాడు. వెంకటేష్ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ఆడవాళ్లూ మీకు జోహార్లు.. అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని వెంకీ ధృవీకరించాడు.
నేను శైలజతో ఆకట్టుకొన్నాడు కిషోర్ తిరుమల. ఇటీవల వెంకీని కలసి ఓ కథ చెప్పడం, ఆయన ఓకే చేయడం జరిగిపోయాయి. కలిసుందాం రా టైపులో ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే వినోదాత్మక కుటుంబ కథా చిత్రమిది. ఆడవాళ్ల గొప్పదనాన్ని చాటి చెప్పే ఉత్తమ చిత్రంగా నిలుస్తుందని వెంకీ ఆశాభావం వ్యక్తం చేశాడు. అందుకు తగ్గట్టుగానే ఈ పేరు డిసైడ్ చేశారట. సాలా ఖద్దూస్ రీమేక్ పూర్తయిన వెంటనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది. సినిమా ఎలా ఉండబోతోతున్నా.. టైటిల్‌తోనే అందర్నీ ఆకట్టుకొన్నాడు వెంకీ.