ఒకప్పటి ఐటెమ్ గీతాల రారాణి జ్యోతిలక్ష్మి కన్ను మూశారు. ఈరోజు ఉదయం చెన్నైలో ఆమె కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె అస్వస్థతతో బాధపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో మృత్యువుతో పోరాడి.. తుదిశ్వాస విడిచారు. దాదాపు 300 చిత్రాల్లో నటించారామె. ఐటెమ్ గీతాలతో, వ్యాంపు తరహా పాత్రలతో అలరించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించారామె. దాదాపు దశాబ్దం పాటు చిత్రసీమను ఓ ఊపు ఊపేశారు. ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకూ టాప్ స్టార్లందరితోనూ ఆడిపాడింది. లేలేలే.. నా రాజా, జ్యోతిలక్ష్మి చీర కట్టింది.. పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. బంగారుబాబు ఆమె నటించిన ఆఖరి తెలుగు చిత్రం. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు చెన్నైలోని కన్నమ్మ పేటలో ఆమె అంత్యక్రియలు జరుగుతాయి.