ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి స్టార్టప్ క్యాపిటల్ నిర్మాణ నిబంధనలను దేశీయ కంపెనీలు కూడా ప్రశ్నించడం తాజ్తా పరిణామం. ఇప్పటికే స్వీకరించిన కన్సార్టియం స్విస్ ఛాలెంజ్ లో ప్రతిపాదనలు ఆర్థిక ఆఫర్లు ప్రభుత్వం రహస్యంగానే అట్టిపెట్టింది. ఈ గోప్యత సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమని తెలిసినా వైఖరి మార్చుకోలేదు. ఇప్పుడు కంపెనీల ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి కూడా వెంటనే సిద్ధపడలేదు. సింగపూర్ కన్సార్టియం స్విస్ ఛాలెంజ్ ప్రీ బిడ ప్రాతిపదికన ్ సమావేశం నిర్వహించినప్పుడు ఈ కంపెనీలు తమ సందేహాలు లేవనెత్తాయి. ఎల్ అండ్ టి, షాపూర్జి పల్లోంజి, రాంకీ, ఆదిత్యా హౌజింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలయన్స్ ఇన్ఫ్రా, జిఐఐసి, చైనా ఫస్ట్ మెటలర్జికల్ కంపెనీల ప్రతినిధులు ,. సిఆర్డిఎ కమీషనర్ చెరుకూరి శ్రీధర్, అదనపు కమీషనర్ రామ్మనోహరరావు, వై. నాగిరెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్టార్టప్ ఏరియాలో స్థలాన్ని ఎలా కేటాయిస్తారు? ప్రభుత్వానికి ఈ స్థలంపై పూర్తిగా హక్కులు ఉన్నాయా? ఉంటే మాకు ఎలా బదాలియిస్తారు ? డెవలప్మెంట్ పూర్తి అయిన తరువాత భూమి ఎవరి చేతిలో ఉంటుంది? ఎలాంటి ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలి? ఈ తరహా ప్రశ్నలలో చాలా వాటికి వారికి జవాబులు లభించలేదు. అలాగే నిర్మాణాలకు పెట్టుబడులు ఎలా వస్తాయనే ప్రశ్న కూడా ఎదురైందిచాలా కాలంగా ఈ రాజధాని నిర్మాణ ప్రణాళికలోనే ప్రభుత్వం మునిగితేలుతుంది కానీ అధికారులు మాత్రం ఈ ప్రశ్నలకు జవాబులు వెంటనే చెప్పలేక పోవడం ఆశ్చర్యమే.
సందేహాలు రాసిస్తే రెండు రోజుల్లో సమాధానం ఇస్తామని అధికారులు బయిటపడ్డారు. . ఇన్నాళ్లుగా తర్జనభర్జన జరుపుతున్న క్రిడా అధికారులు ఇలాంటి ప్రాథమిక ప్రశ్నలకు కూడా వెంటనే జవాబులు చెప్పకపోవడం వ్యూహాత్మకమా? లేక సంపూర్ణ నిరాకరణమా? మరోవైపున రఘు కేశవన్ నాయకత్వంలోని ప్రపంచ బ్యాంకు బృందం ఆ ప్రాంతంలో ప్రధాన సమస్యగా ఉన్న వరద ముంపు నివారణకు ప్రణాళిక వివరాలపై క్రిడా అధికారులను ప్రశ్నించింది. ఈ సమస్య తీవ్రంగానే ఉంటుందని కూడా వారు అంచనాకు వచ్చారు. ఇప్పటికే రెండుసార్లు సమావేశమైన ప్రపంచ బ్యాంకు బృందం మరిన్ని వివరాలు అందించాకే తమ నివేదిక తయారు చేయగలమంటూ మరింత వ్యవధి తీసుకుంటున్నది.
. మూడోది రైతుల కోణం. రాయపూడి, మందడం, తుళ్లూరు, వెంకటాయపాలెం, కృష్ణాయపాలెం వంటి గ్రామాల్లో భారీ భవంతులు కట్టకపోతే నగర కళ రావడం లేదని ప్రభుత్వం భావించిందట. బాగానే వుంది. అయితే గ్రామ కంఠాల సమస్య పరిష్కారం కాకుండానే నిర్మాణాల కోసం తొందరపెట్టడం, వ్యాపారులకు అప్పగించాల్సిందిగా ఒత్తిడి చేయడం రైతుల ఆగ్రహానికి దారి తీస్తున్నది. మేమిచ్చిన భూమికి బదులు రావాల్సిన ప్లాట్లు కేటాయించాల్సింది పోయి బిల్డర్లకు ఇమ్మని వెంటబడడం ఏంటని వారు అభ్యరతరాలు పెడుతున్నారు. ఇదే అవకాశంగా చాలా మంది బిల్డర్లు కొత్తకొత్త షరతులను ముందుకు తీసుకువస్తున్నారు. క్రిడా రైతులు నిర్మాణ సంస్థల మధ్య ఏకాభిప్రాయం వచ్చే అవకాశం ఇప్పటికైతే కనిపించడం లేదు. అయితే భవనాలు కడితే ఆదాయాలు పెరుగుతాయంటూ ప్రభుత్వం ఆశలు చూపిస్తున్నా అనుభవాలను బట్టి వారినుంచి అంత ఉత్సాహం కనిపించడం లేదు.