అఖిల్ రెండో సినిమా విషయంలో ఇంకా టెన్షన్ కొనసాగుతూనే ఉంది. కృష్ణగాడి వీర ప్రేమగాథతో హిట్టుకొట్టిన హను రాఘవపూడితో అఖిల్ రెండో సినిమా ఉండబోతోందన్న వార్తలు బయటకు వచ్చినా.. దర్శకుడి విషయంలో ఇంకోసారి ఆలోచించాలని నాగార్జున భావిస్తుండడంతో .. రెండో సినిమా ముందుకు పడడం లేదు. ఇటీవల అఖిల్, హనులతో సుదీర్ఘమంతనాలు జరిపాడట నాగ్. అయితే.. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కించాలన్న విషయంలో ఇంకా ఓ క్లారిటీకి రాలేదని టాక్. ఈలోగా మరో దర్శకుడు రంగంలోకి దిగాడు.. తనే విక్రమ్ కె.కుమార్.
‘మనం’తో… అక్కినేని కుటుంబం కలకాలం గుర్తిండిపోయే చిత్రాన్ని అందించాడు విక్రమ్ కె.కుమార్. ఆ సినిమా తరవాత అన్నపూర్ణ బ్యానర్లో మరో సినిమా చేసిపెట్టమని నాగ్ విక్రమ్‌ని కోరాడట. దానికి విక్రమ్ కూడా అంగీకారం తెలిపాడు. అఖిల్ తొలి సినిమా కి విక్రమ్ దర్శకత్వం వహించాల్సింది. కానీ సమయాభావం వల్ల… ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు.లేటెస్టుగా విక్రమ్నాగార్జునని కలిసినట్టు, ఓ కథ విషయంలో సుదీర్ఘమంతనాలు జరిపినట్టు టాక్. అదంతా అఖిల్ కోసమే అని టాక్. హను రాఘవపూడి సినిమా పూర్తయ్యాక… విక్రమ్ సినిమా ఉంటుందా, లేదంటే.. దానికంటే ముందు ఈ సినిమా పట్టాలెక్కిస్తారా అనేది తేలాల్సివుంది. ఏదైమైనా అఖిల్ – విక్రమ్ ల సినిమా ఖాయమన్నది లేటెస్ట్
ఫిల్మ్‌నగర్ న్యూస్.