ఇది వరకు కథ డిమాండ్ చేస్తే కండలు పెంచి సిక్స్ ప్యాక్ చేసేవాళ్లు హీరోలు. ఇప్పుడు సిక్స్‌ప్యాక్ వచ్చేసింది కదా.. అని అలాంటి కథల్ని, అలాంటి సన్నివేశాల్నీ కోరుకొంటున్నారు. సరైనోడు తరవాత బన్నీ మరోసారి సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాబోయే సినిమాలో తన సిక్స్‌ప్యాక్ చూపించేందుకు వీలుగా కొన్ని సన్నివేశాల్ని యాడ్ చేస్తున్నాడట. అదీ.. విచిత్రం. సరైనోడు తరవాత అల్లు అర్జున్ హరీష్ శంకర్‌తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. హరీష్ ఎప్పటిలానే సినిమా అంతా సరదా సరదాగా సాగిపోయే సీన్లతో నింపేశాడట. ఫైనల్ నేరేషన్ విన్న బన్నీ మాత్రం.. ‘ఇందులో యాక్షన్ డోసు బాగా తగ్గింది. దాన్ని పెంచి కథ మళ్లీ చెప్పు’ అని పంపేశాడట. ఇప్పుడు హరీష్ శంకర్ అదే పనిలో ఉన్నట్టు టాక్. అందుకే ఈ సినిమా పట్టాలెక్కడం ఆలస్యం అవుతోందని టాలీవుడ్ సమాచారం.
సరైనోడులో బన్నీ యాక్షన్ అదరగొట్టేశాడు. విలన్ గ్యాంగ్‌లోని రౌడీలను ఒంటిచేత్తే ఎత్తి అవతల పారేశాడు. తదుపరి సినిమాలో అంత కాకపోయినా.. ఆ స్థాయిలో అయినా… యాక్షన్ సన్నివేశాలు ఉండాలి కదా? అందుకే బన్నీ అందుకు సంబంధించిన మార్పులు సూచించాడట. కేరళలో బన్నీ ఫ్యాన్స్ రోజురోజుకీ పెరిగిపోతున్నారంటే.. బన్నీకొచ్చిన యాక్షన్ ఇమేజే కారణం. సినిమాల్ని చేస్తున్నప్పుడు వాళ్లని కూడా దృష్టిలో ఉంచుకోవాలి కదా? అందుకే.. యాక్షన్‌పై ఫోకస్ పెడుతున్నాడు బన్నీ. అంటే తదుపరి సినిమాలోనూ బన్నీ ఫైట్లు ఓ రేంజులోనే ఉంటాయన్నమాట.