ఎన్నో అంచనాల మధ్య బాబు బంగారం విడుదలైంది. కథ పరంగా దర్శకుడు మారుతి ప్రయోగాలేం చేయలేదు. అందరికీ తెలిసిన కథే ఎంచుకొన్నాడు. కొత్త కథలేదని ఆడియన్సూ ఎప్పుడూ డిజప్పాయింట్ కారు. కథ చెప్పిన విధానం నచ్చాలంతే. కానీ.. ఈ బాబు బంగారం కాపీ కథ అని తేలిపోయింది. అప్పుడెప్పుడో నాగార్జున కథానాయకుడిగా నటించిన నిర్ణయం కథ, బాబుబంగారం కథ ఇంచుమించు ఒకటే. ఓ హంతకుడ్ని పట్టుకోవడం కోసం హీరో అన్వేషణ మొదలెడతాడు. ఆ హంతకుడు హీరోయిన్ తండ్రి. అందుకే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా హీరోయిన్ ని ముందు ప్రేమలోకి దించుతాడు. సేమ్ టూ సేమ్.. బాబు బంగారం కాన్సెప్ట్ కూడా అదే. కథానాయకుడిగా ఇన్ని సినిమాలు చేసిన వెంకటేష్.. ఇలాంటి కథ ఎప్పుడొచ్చిందో కూడా చూసుకోకుండా సినిమాని ఓకే చేయడం విడ్డూరంగా అనిపిస్తుంది. ఓవరాల్గా ఈ సినిమాకి మిక్స్డ్ రిపోర్ట్ వస్తోంది. దానికి తోడు నిర్ణయం సినిమాకి రీమేక్, ఫ్రీమేక్ అంటూ పోలికలు కూడా తీస్తున్నారు. బాబు టైమ్ బాలేదంతే.. బ్యాడ్ లక్. మరి వీటిపై మారుతి ఏం సమాధానం చెబుతాడో చూడాలి.