భలే భలే మగాడివోయ్ లాంటి క్లాసిక్ ఎంటర్టైనర్ తర్వాత సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో బాబు బంగారం సినిమాకి మంచి క్రేజే వచ్చింది. వెంకటేష్, నయనతారల బ్యూటిఫుల్ పోస్టర్స్ కూడా సినిమాపైన అంచనాలు పెంచాయి. ట్రైలర్ కూడా చాలా మందికి నచ్చింది. కానీ ఫైనల్ రిజల్ట్ మాత్రం ప్రోత్సాహకరంగా లేదు. అలా జరగడానికి చాలా కారణాలున్నాయి. వాటి విషయం పక్కన పెడితే రెగ్యులర్‌గా మన డైరెక్టర్స్ చేస్తున్న తప్పులు మాత్రం కొన్ని ఉన్నాయి. ఈ సినిమాలో అలాంటి ఓ రెండు బిగ్గెస్ట్ మిస్టేక్స్ చేశాడు మారుతి.
తన కెరీర్లోనే ఫస్ట్ టైం ఓ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాడు మారుతి. చిన్నప్పటి నుంచీ వెంకటేష్ సినిమాలు చూస్తూ పెరిగానని చెప్పాడు ప్రమోషన్స్ టైంలో చెప్పాడు. అదే ఈ సినిమాకు నష్టం చేసింది. కథ, కథనాలను వదిలేసి వెంకటేష్‌ని చాలా బాగా చూపించాలని తపనపడ్డాడు. వెంకటేష్‌ని బాగా చూపించడం కోసం ఫొటోషాప్, గ్రాఫిక్స్‌ని కూడా బాగానే వాడుకున్నాడు. వెంకటేష్‌కి సూపర్ స్టార్ఢం ఉందని మనవాడు ఏధైతే ఫీలవుతున్నాడో దాన్ని ప్రజెంట్ చేయడం కోసం బోలెడన్ని బిల్డప్ షాట్స్ ప్లాన్ చేశాడు. వెంకటేష్‌ని దృష్టిలో పెట్టుకునే సీన్స్ రాసుకున్నాడు. ఫైట్ సీన్స్‌ని కూడా అవసరం లేకపోయినా ఇరికించేశాడు. ఇక వెంకటేష్ కాస్ట్యూమ్స్ విషయంలో అయితే చాలా చాలా వర్క్ చేశాడు. అంత వరకూ మనవాడు సక్సెస్ అయ్యాడు కూడా. కానీ ప్రేక్షకులే చాలా మారిపోయారు. హీరోల స్టార్ ఢమ్, బిల్డప్ సీన్స్ కోసం సినిమాలకు వచ్చే ప్రేక్షకులు బాగా తగ్గిపోయారు. ఆ విషయం తెలుసు కనుకే మనం, సోగ్గాడే చిన్ని నాయనా లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు నాగార్జున. చాలా చిన్న హీరోలతో మారుతి కథ, మాటలు, దర్శకత్వ పర్యవేక్షణతో వచ్చిన ప్రేమ కథా చిత్రం, మారుతి డైరెక్షన్లో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమాలు సూపర్ హిట్ అవ్వడానికి కారణం ఆ సినిమా కథ, కథనాల్లో కంటెంట్ ఉండబట్టే. ఇప్పుడు సినిమాకి వస్తున్న ప్రేక్షకులలో ఎక్కువ మంది మంచి సినిమాను చూసిన ఎక్స్‌పీరియన్స్‌ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకు స్టార్లు, స్టార్ఢమ్, ఇమేజ్ లాంటివి అస్సలు అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే అలాంటి బిల్డప్స్ ఎక్కువైతే ఇరిటేటింగ్‌గా ఫీలవుతున్నారు. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలుగా వచ్చిన చంద్రముఖి, రోబోలే రజినీకి కూడా సూపర్ హిట్స్ ఇచ్చాయి. ఈ స్టార్ఢం భ్రమల నుంచి బయటపడి ప్రేక్షకులకు ఓ మంచి సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం ప్రయత్నిస్తే బెటర్.
ఇక బాబు బంగారం సినిమాలో అక్కడక్కడా బొబ్బిలి రాజా సినిమా సిగ్నేచర్ ట్యూన్ వినిపిస్తూ ఉంటుంది. అది కూడా ఈ సినిమాకు మైనస్ చేసింది. మనం చేస్తున్న సినిమా ఆ పాత మధురాల స్థాయిలో ఉంటేనే వాటిని టచ్ చేయడం బెటర్. లేకపోతే పరిస్థితి బాబు బంగారం సినిమాలా అవుతుంది. నిజానికి బాబు బంగారం సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరీ బ్యాడ్‌గా ఏమీ లేదు. కానీ బొబ్బిలి రాజా క్లాసిక్ ట్యూన్ మధ్య మధ్యలో వినిపిస్తూ ఉండడంతో అనుకోకుండానే ఆడియన్స్ కంపేర్ చేసుకున్నారు. దాంతో ఈ క్రియేటివిటీ స్టాండర్డ్స్ పడిపోయాయి. అలాగే పృథ్వీ చేత చేయించిన స్పూఫ్స్ కూడా అసహనం కలిగించాయి. కథలో భాగంగా అవసరమైతే ట్రై చేయడంలో తప్పు లేదు కానీ కామెడీ పేరు చెప్పి ఇరకిస్తే మాత్రం ఫలితం ఇలాగే ఉంటుంది. మారుతి లాంటి టాలెంటెడ్, ట్రెండీ డైరెక్టర్ ఇలాంటి మిస్టేక్స్ చేస్తాడని మాత్రం ఎవ్వరూ ఊహించి ఉండరు. అలాగే విలన్స్‌ని బఫూన్స్‌ని చేయడమనే కాన్సెప్ట్‌ని కూడా వదిలేస్తే బెటరేమో.