సినిమా పోస్టర్ చూసి రిజల్ట్ చెప్పేసే టాలెంట్ ఉన్న నిర్మాత దిల్‌రాజు. ఆయన ఓ సినిమాపై కన్నేశారంటే అది సూపర్ హిట్ అవ్వడం ఖాయం. ఇప్పుడాయన దృష్టి.. జనతా గ్యారేజ్‌పై పడింది. ఈ సినిమా నైజాం రైట్స్ ఆయనే దక్కించుకొన్నారు. జనతా ఆడియో ఫంక్షన్లో దిల్‌రాజు.. ఈ సినిమాని గబ్బర్‌సింగ్, మగధీరలతో పోల్చడం ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరుగుతోంది. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
”కొన్ని సినిమాల్ని చూస్తే రేంజ్ ఏమిటో అర్థమైపోతుంది. అప్పుడు గబ్బర్‌సింగ్‌కి అలానే అనిపించింది. మగధీరకూ అలానే అనిపించింది. ఇప్పుడు జనతా గ్యారేజ్‌కి ఆ వేవ్ కనిపిస్తోంది. సింహాద్రి సమయంలో ఎంత వేవ్ వచ్చిందో,.. జనతాకు అంత వేవ్ వస్తోంది. ఎన్టీఆర్ కెరీర్లో ఇది నెంబర్ సినిమా అవుతుంది. ఆల్రెడీ పాటలు విన్నా. ఎన్టీఆర్ తన కార్ వేన్లో రెండు పాటలు వినిపించాడు. వినగానే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనిపించింది” అన్నారు దిల్‌రాజు.