ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ట్రైలర్ వచ్చేసింది. మాస్ హీరో సినిమా ట్రైలర్ అంటే… డాన్సులు చూపిద్దాం.. పంచ్ డైలాగులు వినిపిద్దాం.. అనే ట్రెండ్ కు దూరంగా సాగిన ట్రైలర్ ఇది. డాన్సులు, ఫైటుల కంటే ఓ కథ చెబుదాం అన్న ఆత్రం ఎక్కువగా కనిపించింది. మొక్కల్ని ప్రేమించే ఎన్టీఆర్, మనుషుల్ని ప్రేమించే మోహన్ లాల్… ఈ ఇద్దరు వ్యక్తులు కలసి చేసిన రిపేర్లేంటన్నది తెరపై చూడమంటూ ట్రైలర్ వదిలారు. కంటెంట్ ఏంటో అర్థమయ్యాక కచ్చితంగా ఈ సినిమా పై ప్రేమ పెరుగుతుంది. ట్రైలర్‌ని కట్ చేసిన విధానం, ఆ డైలాగులు, కంటెంట్.. ఇవన్నీ సింప్లీ సూపర్బ్. ఈ సినిమా కచ్చితంగా ఎన్టీఆర్‌ని ఇంకో రేంజ్‌కి తీసుకెళ్లే సినిమాలానే అనిపిస్తోంది. అందుకే అభిమానులు క్యాప్షన్లు కూడా ఇచ్చేస్తున్నారు. ”జనతా గ్యారేజ్.. ఇక్కడ అన్ని రికార్డులూ బ్రేక్ చేయబడును” అని. అది నిజం కావాలని కోరుకొందాం. ఇక ట్రైలర్ ఎలా ఉందో… మీరూ వీక్షించండి.