ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన చిత్రం జనతా గ్యారేజ్. సెప్టెంబరు 2న ఈ చిత్రం విడుదల కాబోతోంది. పోస్టర్లలో ఎన్టీఆర్ గెటప్పులు, స్టైలింగ్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ థ్రిల్లయిపోతున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ బుల్లెట్‌పై వస్తున్న లుక్ చూసి ‘ఎన్టీఆర్ కాలేజీ కుర్రాడిలా ఉన్నాడు’ అంటూ కితాబులు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ బుల్లెట్‌కి అభిమానులు సొంతం చేసుకొనే అవకాశం కల్పిస్తోంది జనతా గ్యారేజ్ టీమ్. ఈసినిమాలో ఎన్టీఆర్ వాడిన బుల్లెట్‌ని లక్కీ డీప్ద్వారా అభిమానులకు అందచేయనున్నారు. అందుకు చేయాల్సిందేంటంటే రూ.1000 పెట్టి ఆన్ లైన్ లో మీ పేరు ఎన్రోల్ చేసుకోవాలి. అలా ఎన్ రోల్ చేసుకొన్నవారిలో ఒకరిని లక్కీ డీప్ ద్వారా ఎంపిక చేస్తారు. అలా వచ్చిన డబ్బుని ఛారిటీ కోసం ఉపయోగించనున్నారు. శ్రీమంతుడు సమయంలో మహేష్ బాబు వాడిన సైకిల్ని ఇలానే వేలం వేశారు. ఇప్పుడు జనతా గ్యారేజ్కీ అదే చేయబోతున్నారన్నమాట. మరి ఆ బుల్లెట్ సొంతం చేసుకొనే లక్కీ అభిమాని ఎవరో చూడాలి.