స్టార్స్‌కంటే కథకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే కథానాయిక నిత్యమీనన్. అందుకే స్టార్స్‌తో చాలా తక్కువ సినిమాలుచేసింది. అల్లు అర్జున్ కలసి సన్నాఫ్ సత్యమూర్తిలో నటించింది. ఇప్పుడు ఎన్టీఆర్‌తో కలసి జనతా గ్యారేజ్‌లో కనిపించనుంది. అయితే.. బన్నీ సంగతి మర్చిపోయిందేమో ”నేను స్టార్ తో కలసి నటించడం ఇదే మొదటిసారి” అంటూ.. జనతా గ్యారేజ్‌లో నోరు జారింది నిత్యమీనన్. దాంతో బన్నీ ఫ్యాన్స్ ఫీలయ్యే ప్రమాదం వచ్చింది. జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్‌ని నిత్య హాజరైంది. ఈ సందర్భంగా నిత్య మాట్లాడుతూ ”కంటెంట్ ఉన్న కమర్షియల్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నా. కథానాయిక పాత్రకు ప్రాధాన్యం ఉన్న మాస్ సినిమా చేయాలని ఎదురుచూస్తున్నప్పుడు ఈ అవకాశం వచ్చింది. పైగా పెద్ద హీరో సినిమా ఫస్ట్ టైమ్ చేస్తున్నా. నేను ఎప్పుడు బయటకు వెళ్లినా `ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడు చేస్తారు” అని అందరూ అడిగేవారు. ఆ అవకాశం ఇప్పుడు దక్కింది. దేవి పాటలు చాలా బాగున్నాయి. ఓ పాట షూట్ చేశాం. చాలా ఎంజాయ్ చేశా“ అంటోంది నిత్య.