వేలాది ఎన్టీఆర్ అభిమానుల సమక్షంలో జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ ఆద్యంతం ఉల్లాసంగా సాగింది. దాదాపుగా ఈ చిత్రబృందం అంతా వేదికపై కనిపించింది. ఎప్పుడూ ఆడియో ఫంక్షన్లకు దూరంగా ఉండే నిత్యమీనన్ కూడా వచ్చింది. అయితే సమంత ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టింది. ట్రైలర్లో చిట్టి పొట్టి డ్రస్సులు వేసుకొని, కాస్త గ్లామర్ గా హాట్ హాట్ గా కనిపించిన సమంత ఏమైపోయిందబ్బా…??? అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఆరా తీయడం మొదలెట్టారు. సమంత చేతిలో ఉన్న ఏకైక తెలుగు సినిమా ఇదే. దీన్నే ఎందుకు పక్కన పెట్టాల్సివచ్చింది? అని ఆసక్తిగా చర్చించుకొంటున్నారు.
ఇలాంటి అనుమానాలు వస్తాయని ముందుగా ఉహించిందేమో?? ”నాకు కాస్త ఒంట్లోబాలేదు.. అందుకే ఈ ఫంక్షన్ మిస్సవుతున్నా…” అంటూ ఓ ట్వీట్ పెట్టింది. నీరసం అవునో.. కాదో తెలీదుగానీ సమంత వస్తే బాగుండేదని మాత్రం అనిపించింది. సమంత డుమ్మా కొట్టడంతో ఈ స్టేజీకి ఉన్న ఏకైక గ్లామర్ అట్రాక్షన్ నిత్యమీనన్ అయ్యింది. నిత్య కూడా ఏదో నామ్ కే వాస్తే అన్నట్టు రెండు ముక్కలు మాట్లాడింది. మోహన్ లాల్ కూడా ఈ కార్యక్రమానికి రాలేదు. దాని గురించి కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా చర్చించుకోవడం కనిపించింది.