నందమూరి బాలకృష్ణ వందో సినిమానా.. మజాకా! ఈ సినిమాఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచే వార్తల్లో నిలుస్తోంది. ప్రతీ రోజూ.. గౌతమి పుత్ర శాతకర్ణి గురించిన ఏదో ఓ న్యూస్ బయటకు వస్తూనే ఉంది. అభిమానుల్ని సంతోష పెడుతూనే ఉంది. ఇప్పుడు బాలయ్య వందో చిత్రానికి సంబంధించిన మరో స్వీట్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా శాటిలైట్ హక్కుల్ని మా టీవీ అప్పుడే సొంతం చేసుకొందని టాక్. రూ.9 కోట్ల ఫ్యాన్సీ ఆఫర్‌తో శాటిలైట్ రేటు సొంతం చేసుకొన్నట్టు విశ్వసనీయ వర్గాల టాక్. బాలయ్య సినిమా అంటే రూ.6 నుంచి 7 కోట్ల మధ్యలో శాటిలైట్ జరుగుతుంది. దాన్ని గౌతమి పుత్ర బ్రేక్ చేసినట్టే. అప్పుడే మా టీవీ.. అడ్వాన్సు కూడా ఇచ్చేసిందట.
మరోవైపు ఓవర్సీస్ రైట్స్కోసం విపరీతమైన పోటీ నెలకొందని టాక్. క్రిష్ సినిమాలు తీసే తీరు.. ప్రవాసాంద్రులకు బాగా నచ్చుతుంది. పైగా ఇది చరిత్ర గురించి చెప్పే సినిమా. అందుకే ఓవర్సీస్ ప్రేక్షకులు ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. బాలయ్య గత చిత్రాలకు అందనంత రేటు ఇచ్చి.. ఓవర్సీస్ హక్కుల్ని కైవసం చేసుకొనేందుకు ఓ పంపిణీ సంస్థ తెగ తాపత్రయపడుతుందని తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే గౌతమి పుత్ర శాతకర్ణి బిజినెస్ ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా జరగొచ్చనిపిస్తోంది. బాలయ్య అభిమానులకు, క్రిష్‌కీ ఇంత కంటే స్వీట్ న్యూస్ ఇంకేముంటుంది?