మొదటి సినిమా గౌరవంతోనే మెగా ఫ్యామిలీ పరువు తీసేశాడు శిరీష్. అప్పటి వరకూ మెగా హీరోలెవ్వరికీ రానన్ని విమర్శలను అల్లు శిరీష్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొత్త జంట సినిమాతో కొంత వరకూ విమర్శలు తగ్గాయి. అల్లు అర్జున్‌కి స్నేహితుడైన మారుతి కూడా శిరీష్‌ని నిలబెట్టడం కోసం మేక్సిమం ఎఫర్ట్స్ పెట్టాడు. కమర్షియల్‌గా వర్కవుట్ అయింది ఏమీ లేకపోయినా అల్లు శిరీష్ లుక్, నటనకు సంబంధించిన విషయాలలో విమర్శల డోస్ తగ్గింది. సోషల్ మీడియా యుగంలో విమర్శలన్నీ కూడా అద్దాల బిల్డింగుల్లో ఉన్నప్పటికీ కళ్ళ ముందే కనిపించే పరిస్థితి. అల్లు శిరీష్‌కి కూడా విమర్శల స్థాయి అర్థమైనట్టుంది.
కొత్త జంట సినిమా తర్వాత వెంటనే సినిమా చేసేయకుండా చాలా కాలం గ్యాప్ తీసుకున్నాడు. లుక్ విషయంలో బెటర్మెంట్ కోసం ముంబై వెళ్లాడు. ఆ విషయాన్ని స్వయంగా అల్లు శిరీషే చెప్పాడు. హెయిర్ స్టైల్ కూడా మార్చుకున్నానని చెప్పాడు. ఆ ప్రభావం మొత్తం ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలో కనిపించింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా అల్లు శిరీష్ లుక్, యాక్టింగ్ స్కిల్స్ మెగా ఫ్యాన్స్‌కి నచ్చాయి. డైలాగ్ డెలివరీ విషయంలో కూడా ఇంప్రూవ్ అయ్యాడు. అల్లు అర్జున్‌ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇలాగే కష్టపడుతూ ఉంటే ఇంకో రెండు మూడు సినిమాల తర్వాతైనా తెలుగు ఆడియన్స్ శిరీష్‌ని హీరోగా యాక్సెప్ట్ చేసే అవకాశాలుంటాయి. కొడుకుని హీరోగా నిలబెట్టగల సామర్ధ్యం అల్లు అరవింద్‌కి ఉంది.
‘బయట నువ్వు ఎలా బిహేవ్ చేస్తావో…అలానే తెరపైన కూడా బిహేవ్ చేయడానికి అవకాశమున్న క్యారెక్టర్స్ సెలక్ట్ చేసుకో. అప్పుడు యాక్ట్ చేయడం చాలా సులభంగా ఉంటుంది…’. ఈ సలహాను అల్లు అర్జున్ ఇచ్చాడని అందుకే డబ్బున్న కుర్రాడి క్యారెక్టర్ని సెలక్ట్ చేసుకున్నానని ‘శ్రీరస్తు శుభమస్తు’ ప్రమోషన్స్ టైంలో అల్లు శిరీష్ చెప్పాడు. తన నిజజీవితంలో ఎలా ఉంటాడో స్క్నీన్ పైన కూడా అలానే కనిపిస్తే సరిపోతుంది కాబట్టే చాలా ఈజీగా యాక్టింగ్ చేసేశాడు. కానీ అన్నయ్య సలహాలు, సూచనలను ఒక్క సినిమాకే పక్కన పెట్టేసినట్టున్నాడు. మనవాడు ఇప్పుడు చేయబోతున్న సినిమా పీరియడ్ ఫిల్మ్ అట. లవ్ స్టోరీ అనే చెప్తున్నారు కానీ వందల ఏళ్ళ క్రితం కుర్రాడిగా కొంత సేపు అల్లు శిరీష్ కనిపిస్తాడు. ఆనాటి బాడీ లాంగ్వేజ్, మాటల ఉచ్ఛారణ, ఎక్స్ప్రెషన్స్…ఇవన్నీ అల్లు శిరీష్‌కి సాధ్యమయ్యే పనేనా? ఎంత పాజిటివ్‌గా ఆలోచిస్తున్నా కూడా అల్లు శిరీష్ ఆ స్థాయిలో యాక్ట్ చేయగలడని….అలాంటి క్యారెక్టర్లో ప్రేక్షకులు అల్లు శిరీష్‌ని యాక్సెప్ట్ చేయగలరనీ అస్సలు నమ్మకం కలగడం లేదు. పైగా నవ్వులపాలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటే బెటరేమో కదా?