ప్రపంచానికి పాఠాలు చెప్పానని తన సొంత డబ్బాను డైరెక్టుగా అసెంబ్లీలోనే కొట్టుకున్న చంద్రబాబును ఒక విషయంలో మాత్రం ఎవ్వరూ బీట్ చేయలేరు. ఎంతమంది ఎన్నిరకాలుగా విమర్శించినా, బాబును ఓ పెద్ద కమెడియన్‌గా ట్రీట్ చేస్తున్నా సొంత డబ్బా కొట్టుకోవడంలో మాత్రం బాబును మించిన వాడు లేడు. ఎవ్వరు ఎన్ని చెప్పినా సరే ఈ విషయంలో మాత్రం అస్సలు వెనక్కు తగ్గే ఉద్ధేశ్యం లేదు చంద్రబాబుకు. చంద్రబాబు సొంత డబ్బా గురించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న జోకుల గురించి చంద్రబాబుకు తెలియనిది కాదు. తన డబ్బాను నమ్మేవాళ్ళు కొంతమంది అయినా ఉన్నారన్నది చంద్రబాబు గట్టి నమ్మకం. అందుకే నమ్మనివాళ్ళను, కామెడీ చేసేవాళ్ళను అస్సలు పట్టించుకోడు. తను చెప్పే మాటలను గుడ్డిగా నమ్మేవాళ్ళ కోసం సొంత పురాణాన్ని వినిపిస్తూనే ఉంటాడు.
తాజాగా మరోసారి అలాంటి ప్రయత్నమే చేశాడు. ఈ రోజంతా ఇండియన్ మీడియా మొత్తం సింధు సక్సెస్ గురించి వేనోళ్ళ పొగుడుతూ ఉంది కదా. ఆ సక్సెస్‌లో తానూ కొంత క్రెడిట్ కొట్టేయాలని బాబు ఉదయం నుంచి ఆలోచించినట్టున్నాడు. సిందు వాళ్ళ నాన్నకు నేనే చెప్పా అంటే మరీ కామెడీగా ఉంటుందనుకున్నాడేమో…గోపీచంద్ వైపు నుంచి నరుక్కొచ్చాడు. పాయింట్ దొరికేసింది. అప్పుడెప్పుడో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోపీచంద్‌కి సహకారమందించానని అందుకే సింధుకు ఈ రోజు మెడల్ వచ్చిందన్నట్టుగా మాట్లాడేశాడు. బాబు మాటలు ఎలా ఉన్న ఫైనల్‌గా అంతరార్తం మాత్రం ఒక్కటే. సింధుకు మెడల్ రావడంలో నా పాత్ర కూడా ఉంది…నన్ను కూడా గుర్తించండి అని చెప్పడం. గుర్తిద్దామా? గుర్తించేవాళ్ళున్నారంటారా? నిజానికి చాలా మంది పొలిటిషియన్స్ కంటే చంద్రబాబు క్రీడలకు మంచి ప్రాధాన్యతే ఇచ్చాడు. కానీ ఇలా కామెడీగా తన గురించి తానే చెప్పేసుకోవడం బాబు ఇమేజ్‌కి ఎంత మాత్రమూ తగదని విశ్లేషకుల మాట.