అఖిల్ ఇప్పుడు కథల వేటలో ఉన్నాడు. అఖిల్ సినిమా ఫ్లాపవ్వడంతో… రెండో సినిమా ఎలాగైనా హిట్టు చేయాలని తాపత్రయపడుతున్నాడు. మాస్, కమర్షియల్ జోనర్ లో వెళ్లడం కంటే ఈసారి సేఫ్జర్నీ చేయడమే బెటర్ అన్నది అఖిల్ వ్యూహం. అందుకే అలాంటి సేఫెస్ట్ ప్రాజెక్ట్ ఫిక్స్ చేయడంలో అఖిల్ బిజీగా ఉన్నాడన్నది టాలీవుడ్ టాక్. నాగార్జున కెరీర్లో ఓ మైలు రాయిగా మిగిలింది.. మన్మథుడు. ఈ సినిమాని ఇప్పటికీ టీవీల్లో చూస్తూనే ఉంటారు. ఈ సినిమాకి ప్రీక్వెల్‌గానీ, సీక్వెల్‌గానీ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడట అఖిల్. ఈ విషయమై త్రివిక్రమ్‌తో కూడా చూచాయిగా మాట్టాడడట.
అఖిల్ తొలి సినిమాకి దర్శకుల్ని వెదికే పనిలో త్రివిక్రమ్‌ని కలిశాడు నాగ్. అప్పట్లోనే మన్మథుడు లాంటి కథ ఒకటి తయారు చేయమని చెప్పాడట. మన్మథుడులో నాగార్జున క్యారెక్టర్ని ఎక్స్ టెన్షన్ చేసేలా ఆ సినిమా ఉండాలని హింట్ ఇచ్చాడట. త్రివిక్రమ్ ఇప్పుడు ఆ పనిలో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. ఆ క్యారెక్టర్ అఖిల్‌కి బాగా సూటవుతాడని అటు నాగ్.. ఇటు త్రివిక్రమ్ ఇద్దరూ నమ్ముతున్నారు. రెండో సినిమాగా మన్మథుడు 2 వర్కవుట్ అయినా అవ్వకపోయినా… ఈ సినిమా అఖిల్‌తో చేయడం ఖాయమని అక్కినేని కాంపౌండ్ వర్గమే చెబుతోంది. సో… త్రివిక్రమ్‌తో అఖిల్ సినిమా రాబోతోందన్నమాట.