హైదరాబాద్: కేంద్ర పట్టణాభివృద్ధిశాఖమంత్రి వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరినొకరు ప్రశంసించుకున్నారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇవాళ జరిగిన నిట్ విద్యాసంస్థ శంకుస్థాపన కార్యక్రమం దీనికి వేదికయింది. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడుకు విజన్, క్యాలిబర్, క్యారెక్టర్ ఉన్నాయని, ప్రాజెక్టులను సాధించుకోగల సామర్థ్యం ఉందని అన్నారు. ఇక చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో వెంకయ్యను ఆకాశానికెత్తేశారు. ఏపీకోసం వెంకయ్య నాయుడు రాజ్యసభలో అభిమన్యుడిలా పోరాడారని కొనియాడారు. ఆయన ఢిల్లీలో ఉన్నంతవరకు ఏపీకి అన్యాయం జరగదని చెప్పారు. ఏపీకి వెంకయ్య నాయుడు పెద్ద దిక్కని అన్నారు. ఆయనవల్లే ప్రత్యేకహోదా(?!@#*?!) తదితర హామీలు వచ్చాయని చెప్పారు.
సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేత రామకృష్ణ అన్నట్లు నెల్లూరు నాయుడు, చిత్తూరు నాయుడు నువ్వు గ్రేట్ అంటే నువ్వు గ్రేట్ బాగానే పొగుడుకుంటున్నారుగానీ ప్రత్యేకహోదా ఏమైందో ఏపీ ప్రజలకు క్లారిటీ ఇస్తే బాగుంటుంది.