బెంగాల్ టైగర్ తరవాత చాలా గ్యాప్ తీసుకొన్నాడు రవితేజ. చాలా కథలు విన్నా.. ఒక్కదానిపైనా మనసు పడలేదు. చివరికి పవర్ దర్శకుడు బాబి కథకు ఓటేశాడు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఇప్పుడు ఈ సినిమా కోసం ఓ పేరు బయటకు వచ్చింది. అదే… ‘క్రాక్’. అప్పుడెప్పుడో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన కిక్ సూపర్ హిట్టయ్యింది. ఆ సౌండ్ ఇప్పుడు క్రాక్‌లో వినిపిస్తోంది. రవితేజకు ఇలాంటి పేర్లు బాగా సెట్టయిపోతాయి. ఇంచుమించు రవితేజ సినిమాల్లో క్యారెక్టరైజేషన్లుఅన్నీ పిచ్చ పిచ్చగా ఉంటాయి కాబట్టి.. ఈ టైటిల్ రవితేజకే యాప్ట్. అందుకే చిత్రబృందం కూడా క్రాక్ పేరుని ఖాయం చేసేసినట్టు సమాచారం. ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషిస్తోంది చిత్రబృందం. రవితేజ అనేసరికి హీరోయిన్లంతా లైట్ తీసుకొంటున్నట్టు సమాచారం. రవితేజ సినిమాల్లో తమ పాత్రలకు అంతగా ప్రాధాన్యం ఉండదని.. అందుకే నో అంటున్నారని టాక్. దానికి తోడు బడా హీరోయిన్లంతా బిజీ బిజీగా ఉన్నారు. అందుకే రవితేజ కోసం కొత్తమ్మాయి కోసం వెదుకుతున్నారని, కేరళ కుర్రదాన్నో, ముంబై భామనో రవితేజ కోసం ఎంపిక చేయొచ్చని తెలుస్తోంది.