పవన్ కల్యాణ్ పేరే ఓ ప్రభంజనం. పవన్ నటించినా, మాట్లాడినా అభిమానులకు పూనకం వచ్చేస్తుంది. పవన్ నిజాయతీ, పవన్స్టైల్.. ఈ రెండింటికీ అభిమానులు మురిసిపోతుంటారు. తెలుగు సినిమా స్టామినా అమాంతం పెంచేసిన కథానాయకుడు పవన్! రికార్డుల రారాజు… బాక్సాఫీసు గబ్బర్‌సింగ్. ఈరోజు పవన్ పుట్టిన రోజు. ఆయనకు సంబంధించిన పది ఆసక్తికరమైన విషయాలు ఇవీ..
- వవన్ సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. చిన్నప్పటి నుంచీ వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఏం చేయాలో తెలీక ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థితుల్లో పవన్ తోట మాలి అవుదామనుకొన్నాడట.
- జీవితంపై స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తి పవన్. పైపై మెరుగులు నచ్చవు. సమాజానికి ఏదో చేయాలన్న కసి.. ధ్యేయం చిన్నప్పటి నుంచే ఉన్నాయి. సినిమాల్లోకి రాకముందు తన స్నేహితుడితో కలసి శ్రీశైలం అడవులకు వెళ్లిపోదామని ప్రయత్నించారు.
- పవన్‌కి భక్తి ఎక్కువ. పూజలు చేయరు గానీ, ఉపవాసాలపై నమ్మకం ఉంది.
- పవన్ కి సిగ్గు, బిడియం చాలా ఎక్కువ. ఇప్పటికీ సెట్లో డాన్సులు చేయడానికి భయపడతాడు. పవన్ డాన్స్ చేయాలంటే కెమెరామెన్, హీరోయిన్ తప్ప సెట్లో ఇంకెవ్వరూ ఉండకూడదట
- చిరంజీవి నటించిన డాడీ సినిమా కోసం పవన్ ఓ ఫైట్ కంపోజ్ చేశాడు.
- విప్లవసాహిత్యం అంటే పవన్‌కి చాలా ఇష్టం. ఎప్పుడైనా ఓ మంచి పుస్తకం చదివితే.. ఆ రచయిత పేరు, చిరునామా కనుక్కొని స్వయంగా వెళ్లి కలిసొచ్చిన సందర్భాలున్నాయి.
- ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం, సత్యానంద్ దగ్గర శిక్షణ తీసుకొంటున్నప్పుడు పవన్ రూమ్‌లోనే శ్రీకాకుళంకి చెందిన ఓ కుర్రాడు కూడా ఉండేవాడట. తన ద్వారా ఫోక్ పాటలు పవన్ కి ఒంటబట్టేశాయి. తన ప్రతీ సినిమాలోనూ ఓ ఫోక్ బీట్ ఉండేలా చూసుకొంటాడు పవన్.
- పవన్ ఫామ్ హోస్లో విలాస వస్తువులేం కనిపించవు. నులకమంచం, చాప, కుండలో నీళ్లు.. కావల్సిన వంట సామాన్లు.. పుక్తకాలు. ఇవే అక్కడి ప్రాపర్టీస్.
- ప్రతీరోజూ చెగోవెరా పుస్తకం ఒక్కటైనా చదువుతాడట పవన్. చదివిన పుస్తకమే అయినా… మళ్లీ మళ్లీ చదువుతుండడం పవన్‌కి అలవాటు.
- అలనాటి క్లాసిక్స్ మాయాబజార్,మల్లీశ్వరి, మిస్సమ్మ సినిమాలంటే పవన్‌కి చాలా చాలా ఇష్టం.