కల్యాణ్‌రామ్ ఏం చేసినా సిన్సియర్‌గా చేస్తాడు. రిజల్ట్పక్కన పెడితే.. ప్రతీ సినిమాలోనూ తన హార్డ్ వర్క్ కనిపిస్తుంటుంది. హరేరామ్ లో రెండు పాత్రల మధ్య వైవిధ్యం స్పష్టంగా చూపించాడు. ఫ్లాప్ అయినా.. ఓం సినిమా కోసంతెగ కష్టపడ్డాడు. ఆ సినిమా కోసం గుండు కొట్టించుకొన్నాడు. త్రీడీ ఎఫెక్టులనూ తెలుగు సినిమాకి పరిచయం చేశాడు. ఎంత డిజాస్టర్ మూవీ అయినా… ప్రతీ సినిమాలోనూ ఏదో ఓ రూపంలో కొత్తదనం చూపించడానికి ట్రై చేస్తుంటాడు. ఇప్పుడు పూరి జగన్నాథ్ ఇజం సినిమా కోసం కూడా అంతే కష్టపడుతున్నాడు. ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేశాడు కల్యాణ్ రామ్. అందుకు సంబంధించిన లుక్ కూడా ఈరోజే బయటకు వచ్చింది.
ఆ స్టిల్ చూస్తే.. కల్యాణ్ రామ్ కండలు పెంచడానికి ఎంత కష్టపడ్డాడో అర్థమవుతూనే ఉంది. పటాస్ తరవాత ఫామ్ లోకి వచ్చిన కల్యాణ్ రామ్ షేర్ తో డీలా పడ్డాడు. ఇప్పుడు అతని ఆశలన్నీ పూరి సినిమాపైనే ఉన్నాయి. పూరి కూడా కసిగానే ఉన్నాడు. టెంపర్ టెంపోని కాపాడుకోవాలంటే ఈ సినిమాతో హిట్టు కొట్టాల్సిందే. పైగా ఎన్టీఆర్‌తో సినిమా చేసే అవకాశం ఆమడ దూరంలో ఉంది పూరికి. అందుకే ఈ ఛాన్స్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోడు. ఇజం లోగో.. పూరి పెడుతున్న క్యాప్షన్లు.. సినిమా బ్యాక్ డ్రాప్ ఇవన్నీ ఆసక్తిని కలిగిస్తున్నాయి. దానికి కల్యాణ్ రామ్ తపన తోడైంది. ఈ స్టిల్‌లో ఇజంపై .. ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరగడం ఖాయం.