రామ్ సినిమాలెప్పుడూ హుషారుగా సాగిపోతాయి. అతని సినిమాలు కమర్షియల్ కొలతలకు అనుగుణంగానే ఉంటాయి. తన తాజా చిత్రం హైపర్ కూడా అలంటి సినిమానే అనుకున్నాం. ట్రైలర్ చూస్తే పక్కా మాస్ మసాలా మూవీ అనిపిస్తోంది. ఐతే ఈ సినిమాలో ఓ సోషల్ మెస్సేజ్ ఉందంట. ఈ విషయాన్ని రామ్ కూడా దృవీకరిస్తున్నాడు. ”ఓ మెస్సేజ్ ఓరియంటెడ్ సినిమా చెయ్యాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఐతే సందేశాలు ఇచ్చేంత వయసు నాకు లేదు అనిపించింది. ఐతే హైపర్ లో ఆ అవకాశం అనుకోకుండా వచ్చింది. ఇదో యూత్ ఫుల్ సబ్జెక్టు. ఐనా సరే చక్కటి మెస్సేజ్ ఉంటుంది. అది యువతరాన్ని బాగా కదిలిస్తుందని నా నమ్మకం ” అంటున్నాడు.
ఈ రోజుల్లో సందేశం ఇస్తానంటే సందేహించాల్సిందే. ఎందుకంటే అలాంటి కథలు కమర్షియాలిటీ కి ఆమడ దూరం లో ఉంటాయి. మరి సంతోష్ శ్రీనివాస్ మెస్సేజ్ నీ, కమర్షియాలిటీ ని ఎలా మిక్స్ చేశాడో మరి..?? ఐతే ఈ సినిమా పై రామ్ చాలా నమ్మకం పెట్టుకున్నట్టే కనిపిస్తోంది. హైపర్ తనకు అన్నివిధాలా సంతృప్తి ఇచ్చిందని, ఈ సినిమాతో హీరోగా, నటుడిగా మరో మెట్టు ఎక్కడం ఖాయం అంటున్నాడు. నేను – శైలజ ఇచ్చిన నమ్మకమో ఏమో.. హైపర్ బిజినెస్ సూపర్ గా జరిగింది. దాదాపు రూ. 8 కోట్ల టేబుల్ ప్రాఫిట్ తో ఈ సినిమా విడుదల అవుతొందని సమాచారం.