తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిరు, బాలయ్య, నాగ్, వెంకీ నాలుగు స్థంభాలు. దశాబ్దాలుగా చలన చిత్ర సీమని మకుటం లేని మహారాజులుగా ఏలారు. ఎవరి శైలి వారిది. ఎవరి క్రేజ్ వాళ్లది. ఈ నలుగురిలో ఎవరు నెంబర్ వన్ అంటే కచ్చితంగా చిరంజీవి పేరే చెప్పుకోవాలి. ఆయన సాధించిన విజయాలు, ఆయనకున్న అభిమానగణం చిరుని నెంబర్ వన్ చేశాయి. ఆ తరవాతే మిగిలిన ముగ్గురూ. చిరు, నాగ్ల మధ్య ఇమేజ్లోనూ, క్రేజ్లోనూ చాలా వ్యత్యాసం ఉంది. అయితే అది వెండి తెరపై మాత్రమే. బుల్లి తెరకు వచ్చేసరికి ఇద్దరూ సరి సమానమేనట. మీలో ఎవరు కోటీశ్వరుడు పోగ్రాం కి నాగ్ స్థానంలో చిరు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోగ్రాం కోసం చిరంజీవి తీసుకొంటున్న పారితోషికం ఎంత? అనే విషయంలో సోషల్ మీడియాలో విస్క్రృతంగా చర్చ జరుగుతోంది. ఒక్కొక్క ఎపిసోడ్కీ చిరు రూ.10 లక్షల వరకూ తీసుకొంటున్నారని, ఇది నాగ్ పారితోషికం కంటే ఎక్కువని ప్రచారం సాగుతోంది.
వీటిపై కాస్త లోతుగా పరిశీలిస్తే… విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. దాని ప్రకారం చిరంజీవి పారితోషికం దాదాపుగా ఎపిసోడ్కి రూ.15 లక్షల వరకూ ఉంటుందని తెలిసింది. అయితే గతంలోనూ నాగార్జున ఇంతే మొత్తం అందుకొన్నారని సమాచారం. అంటే చిరుకీ, నాగ్కీ ఒకటే పారితోషికం అన్నమాట. టీవీ సీరియళ్లు, మిగిలిన గేమ్ షోలతో పోలిస్తే… మీలో ఎవరు కోటీశ్వరుడికి బడ్జెట్ ఎక్కువ మొత్తంలో కేటాయించాల్సివస్తోందట. డైలీ సీరియల్ ఒక ఎపిసోడ్ తీసిన ఖర్చుతో పోలీస్తే మీలో ఎవరు కోటీశ్వరుడు ఖర్చు పది రెట్లు ఉంటుందని తెలుస్తోంది. ప్రమోషన్ల కోసం కూడా భారీ ఎత్తున ఖర్చుపెట్టాల్సివస్తోందట. చిరు వస్తే ఆ పారితోషికంలో మార్పు వస్తుందని అనుకొన్నారంతా. అయితే.. మీలో ఎవరు కోటీశ్వరుడికి అంటూ ఓ బడ్జెట్ నిర్ణయింపబడి ఉందట. దాన్ని దాటడానికి మాటీవీ యాజమాన్యం సిద్దంగా లేదని తెలిసింది. పారితోషికం విషయంలో చిరు కూడా ఓ మెట్టు దిగిరావడం వల్ల నాగ్ ఎంత తీసుకొన్నారో, దాదాపు అంతే మొత్తం చిరుకీ దక్కిందని సమాచారం. సో… వెండి తెరపై చిరు, నాగ్ల ఇమేజ్ మధ్య గ్యాప్ ఉన్నా, బుల్లి తెర విషయంలో అది బ్యాలెన్స్ అయిపోయిందన్నమాట.