‘పెళ్లి చూపులు’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టేశాడు విజయ్ దేవరకొండ. అంతకు ముందు ‘ఎవడే సుబ్రమణ్యం’లోనూ డీసెంట్‌గా నటించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. పెళ్లి చూపులతో మాత్రం విజయ్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ సినిమా రూపాయికి పది రూపాయల లాభం తీసుకురావడంతో… విజయ్ నెక్ట్స్ సినిమా పై అటు బయ్యర్లు, ఇటు ఆడియన్స్ దృష్టిపెట్టారు. దాంతో… ‘ద్వారక’కి క్రేజ్ పెరిగింది. టాలీవుడ్‌కి ఎన్నో హిట్స్ అందించిన సూపర్ గుడ్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. ‘ద్వారక’పై మరిన్ని అంచనాలు పెరిగాయి. వాటిని అందుకొనే స్థాయిలోనే కనిపించింది ద్వారక టీజర్. ఇదో దొంగ స్వామి కథ అన్నది ట్రైలర్లోనే అర్థమవుతోంది. అతనికో లవ్ స్టోరీ, కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్, భక్తిని ఎరగా వేసి తమ పబ్బం గడుపుకొనే పొలిటీషన్లు.. వగైరా వగైరాతో ‘ద్వారక’ కరెంట్ టాపిక్స్ పై నడిచే రొమాంటిక్ థ్రిల్లర్‌గా కనిపిస్తోంది.
ఇది వరకు దాదాపు ఇదే టాపిక్‌తో ‘అయ్యారే’ లాంటి సినిమాలొచ్చాయి. వాటి పోలిక ‘ద్వారక’పై పడకపోతే చాలు. ఎంటర్టైన్మెంట్కీ, రొమాన్స్కీ లోటు చేయలేదన్న విషయం.. టీజర్లోనే స్పష్టం చేశారు. ఎందుకంటే… దొంగ స్వామి లీలలతో పాటు.. హీరోయిన్‌తో లిప్ లాక్ చేసి ‘రాసలీల’లూ బయటపెట్టారు ఈ ట్రైలర్లో. శ్రీనివాస రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించాడు. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.