బద్రి సినిమాతో పూరీ జగన్నాథ్‌కి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిందే పవన్. అయితే దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన పవన్… సినిమా తీసే అవకాశం మాత్రం పూర్తిగా పూరీకి ఇవ్వలేదు. ఫైట్స్, సాంగ్స్‌తో పాటు ఇంకా చాలా భాగం సినిమాను పవన్ కళ్యాణే చూసుకున్నాడు. ఏ డైరెక్టర్ అయినా సరే అలాంటి వ్యవహారాలను అస్సలు ఇష్టపడడు. సినిమా షూటింగ్ టైంలో పూరీ జగన్నాథ్ ఎలా ఫీలయ్యాడో తెలియదు కానీ, ‘బద్రి’ సినిమా హిట్ అవ్వడంలో ఆ సాంగ్స్, ఫైట్స్ కూడా చాలా కీలక పాత్ర పోషించడంతో.. ఆ రకంగా పూరీ ఫుల్ హ్యాపీ అయ్యాడు. బద్రి తర్వాత కూడా ‘పోకిరి’ సినిమా కథతో సహా తను రాసుకున్న చాలా కథలను పవన్‌కి వినిపించాడు పూరీ. కానీ అవేవీ పవన్‌కి నచ్చలేదు.
చాలా కాలం తర్వాత ఇద్దరూ కలిసి ‘కెమేరా మేన్ గంగతో రాంబాబు’ సినిమాకు పని చేశారు. అయితే ఈ సినిమా టైంకి పూరీ కూడా స్టార్ హోదాలో ఉండడంతో… ఇద్దరు స్టార్స్ మధ్య బోలెడన్ని ఇష్యూస్ వచ్చాయి. సినిమా మేకింగ్‌లో పవన్ కళ్యాణ్ వేలు పెట్టడం పూరీ ఇగోని హర్ట్ చేసింది. బద్రి టైంకి కొత్త డైరెక్టర్ కాబట్టి ఒకె. కానీ ‘కెమేరా మేన్…’ టైంకి మనవాడు స్టార్ డైరెక్టర్ కదా. అందుకే ఇద్దరి మధ్యా సమస్యలు వచ్చాయి. ఆ తర్వాత వైజాగ్‌లో ఓ మీడియా ప్రతినిధితో సరదాగా మాట్లాడుతూ పవన్ గురించి ఘాటైన విమర్శలు చేశాడు పూరీ. అలాగే ఇద్దరమ్మాయిలతో సినిమాతో సహా చాలా సినిమాల్లో పవన్ పైన సెటైర్స్ వేశాడు. ఇక పూరీ జగన్నాథ్ గురువు రామ్ గోపాల్ వర్మ చేసిన విమర్శల గురించి అయితే చెప్పనవసరం లేదు.
ఇప్పుడు ఇజం సినిమా ప్రమోషన్స్ టైంలో కూడా పొట్టేసుకుని మెస్పేజ్లు ఇస్తూ ఉంటే బాగుండదు కదా అన్నాడు. ‘కెమేరా మేన్ గంగతో రాంబాబు’ సినిమాలో పవన్ కళ్యాణ్ రంభలా ఉన్నాడని ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ కూడా ట్వీట్ చేశాడు. ఇవన్నీ కాకతాళీయమే అనుకున్నా ‘ఇజం’ సినిమాలో విలన్ అయిన జావేద్ ఇబ్రహీంతో రాసుకు పూసుకు తిరుగుతూ, వాడికి హెల్ప్ చేస్తూ ఉండే పరమ వరస్ట్ అండ్ కామెడీ రాజకీయ నాయకుడి క్యారెక్టర్ ఒకటుంది. ఆ క్యారెక్టర్ని పోసాని కృష్ణమురళి పోషించాడు. పోసాని కృష్ణమురళి తన తోటి రాజకీయ నాయకులతో, మీడియా వారితో మీట్ అయిన ప్రతి సీన్లోనూ బ్యాక్ గ్రౌండ్లో పోసాని పార్టీ సింబల్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ గుర్తు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన గుర్తుకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇది మాత్రం కాకతాళీయం అయ్యే ఛాన్సే లేదు. ఇక పూరీ చర్యకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి స్థాయి వారి మాటలకు కూడా రియాక్టయ్యే రకం కాదు పవన్. ఇక పూరీ చిలిపి ప్రయత్నాలకు ఎందుకు రియాక్టవుతాడు?