హైదరాబాదులో ఎపి ప్రభుత్వం ఖాళీ చేసిన సచివాలయ బ్లాకులను తెలంగాణకు అప్పగించడం తథ్యమని అందరికీ తెలుసు. అయితే కాని లీకులతో కథ నడపడం ఎందుకు?ఆ పనేదో హుందాగా ముఖ్యమంత్రులు మాట్లాడుకుని చేసుకుంటే చాలా బావుండేది కదా? తెలంగాణ ప్రభుత్వం తన అకాంక్షను బయిటపెట్టింది. గవర్నర్తో చర్చించింది. అధికారికంగా ఆ మంత్రివర్గం తీర్మానం చేసింది. బహుశా అప్పటికే గవర్నర్ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ మాట్లాడేశారు. భవనాల కేటాయింపు చేసింది ఆయనే గనక ఈ విషయంలో తప్పక పాత్ర వుంటుంది. ఇదే చొరవ మిగిలిన వివాదాల పరిష్కారంలోనూ చూపిస్తే ఉభయతారకంగా వుంటుంది. ఎందుకంటే వివాదాలు మీడియా సృష్టి అని ఆయన ఉత్సాహంలో అన్నారేమో గాని కొన్ని తీవ్ర విభేదాలు చిక్కు ముడులు వున్నమాట నిజమే.ఇచ్చిపుచ్చుకోవడం తప్ప ఇందుకు మరో మార్గమేముటుంది?