బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. అల్లుడు శీను, స్పీడున్నోడు తో ఆకట్టుకొన్న బెల్లం కొండ సాయి శ్రీనివాస్ ఇందులో కథానాయకుడు. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఎప్పుడో లాంఛనంగా మొదలైంది. ఇంత వరకూ సెట్స్‌పైకి వెళ్లలేదు. అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేసుకొంటూ వస్తున్నారు. శ్రీనివాస్ మేకొవర్లో దిగాడని, ఈ సినిమా కోసం బాడీనీ, స్టైల్‌నీ మార్చుకొంటున్నాడని చెప్పుకొన్నారు. అయితే అసలు విషయం వేరే ఉంది. ఈ సినిమా ని అభిషేక్ పిక్చర్స్సంస్థ తెరకెక్కిస్తోంది. ఇప్పుడు సడన్ గా ఆ సంస్థ చేతులెత్తేసింది. ` ఈ ప్రాజెక్టు చేయడం మా వల్ల కాదు` అంటూ… డ్రాప్ అయిపోయారు. దాంతో ఈ సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది.
తనయుడి సినిమా ఆగిపోవడంతో డిజప్పాయింట్ అయిన బెల్లంకొండ సురేష్ అఘమేఘాల మీద మరో నిర్మాతని రంగంలోకి దింపినట్టు సమాచారం. సాహసమే శ్వాసగా సాగిపో.. సినిమా నిర్మిస్తున్న ఎం.రవీందర్ రెడ్డి ఈ ప్రాజెక్టుని టేకప్ చేశారని తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావొచ్చు. నవంబరు 4 నుంచి ఈ సినిమా యధావిధిగా మొదలవుతుందని, నిర్మాతనే మారారని తెలుస్తోంది. అయితే… ఈ ప్రాజెక్టు నుంచి డ్రాప్ అవ్వాలని బోయపాటి శ్రీనుకీ ఉందట. సరైనోడు తరవాత బోయపాటికి భారీ, క్రేజీ ఆఫర్లు అందాయి. అంతకు ముందే బెల్లంకొండకు ఇచ్చిన కమిట్మెంట్ వల్ల ఈ సినిమాని వదల్లేకపోతున్నాడు. దర్శకుడు మారతాడేమో అనుకొంటే… సడన్‌గా నిర్మాత మారిపోయాడు. అంతే.. చిత్రసీమలో ఏమైనా జరగొచ్చు.