బాహుబలి 2 షూటింగ్ ముగిసిన వెంటనే.. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో సినిమా చేయడానికి సన్నద్దం అయిపోతున్నాడు ప్రభాస్. ఇప్పటికే సుజిత్ బౌండెడ్ స్ర్కిప్ట్‌ని రెడీ చేసి పెట్టుకొన్నాడు. ప్రభాస్ రాగానే రంగంలోకి దిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈయేడాది చివర్లోనే ఈ సినిమా మొదలైపోవొచ్చని చెబుతున్నారు. బాహుబలికి పని చేసిన కొంతమంది ప్రధాన టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పని చేస్తారని టాక్. కథానాయికగా ఎవరిని తీసుకోవాలన్న విషయంలో చిత్రబృందం మల్లగుల్లాలు పడుతోంది. ఈ సినిమాని హిందీలోనూ విడుదల చేయనున్నారు. అందుకే బాలీవుడ్ కథానాయికని తీసుకొంటే బెటర్ అన్న ఆలోచనకు వచ్చింది చిత్రబృందం. పరిణితీ చోప్రా, సోనాక్షి సిన్హాలలో ఒకరిని కథానాయికగా ఎంచుకొనే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే ప్రభాస్ దృష్టి మాత్రం పరిణితీ చోప్రాపైనే ఉన్నట్టు టాక్. కథానాయికగా తనే ఫైనలైజ్ అయ్యే అవకాశాలున్నాయని టాక్. ప్రస్తుతం యూ వీ క్రియేషన్స్ ప్రతినిధి బృందం పరిణితీ చోప్రాతో సంప్రదింపులు మొదలెట్టినట్టు టాక్. డేట్ల ఎడ్జిస్ట్మెంట్లు, పారితోషికం తదితర విషయాల గురించి చర్చించుకొంటున్నార్ట.
అతి త్వరలోనే కథానాయిక విషయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. మినిమం బడ్జెట్లో ఈ సినిమాని తీద్దామనుకొన్నా.. నిర్మాతల ఆలోచన మారిందని, బాహుబలితో ప్రభాస్‌కి పెరిగిన మార్కెట్ దృష్ట్యా బడ్జెట్ విషయంలో రాజీ పడకూడదని యూ వీ క్రియేషన్స్ భావిస్తోందట. అందుకే రూ.150 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు టాక్. బాహుబలి తరవాత ఆ స్థాయి బడ్జెట్‌తో తెరకెక్కే తెలుగు చిత్రమిదే.