పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఇజం’. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్లాప్ టాక్ వచ్చినా, పెద్దగా పోటీ లేకపోవడంతో మంచి ఓపెనింగ్స్‌నే అందుకొంది. ఇప్పుడీ చిత్రాన్ని బాలీవుడ్‌కి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. పూరి ఈ కథని సల్మాన్ ఖాన్‌కి వినిపించాలనుకొంటున్నాడట. ఇది వరకు కూడా ‘బిజినెస్ మేన్’, ‘టెంపర్’ సినిమాల్ని బాలీవుడ్లో రీమేక్ చేయాలని భావించాడు పూరి. అయితే… ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. ఈసారి మాత్రం ‘ఇజం’ సినిమాని అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ రీమేక్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడట. నిజానికి ఫలితం ఎలా ఉన్నా.. ‘ఇజం’ కాన్సెప్ట్ మంచిదే.
విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని మనదేశం రప్పించేందుకు ఓ జర్నలిస్టు చేసే ప్రయత్నం ఈ సినిమా కథ. దాన్ని కాస్త జాగ్రత్తగా డీల్ చేస్తే, ఇంకాస్త రిసెర్చ్ వర్క్ చేస్తే… తగిన ఫలితం ఉండేది. అయితే.. పూరి తనకు అలవాటైన కమర్షియల్ పంథాలో తెరకెక్కించేశాడు. ఇప్పుడు కాస్త టైమ్ తీసుకొని, సల్మాన్ ఇమేజ్ మ్యాజ్ అయ్యేలా కథలో మార్పులూ చేర్పులూ చేసుకొని బాలీవుడ్‌కి తీసుకెళ్లాలని భావిస్తున్నాడట. సల్మాన్‌తో పూరి కాస్త టచ్‌లోనే ఉన్నాడు. పూరి తీసిన పోకిరిని సల్మాన్ బాలీవుడ్లో తీసి కోట్లు దండుకొన్నాడు. ఆ పరిచయం కొద్దీ ఇజం కథ వినిపించే ఛాన్స్ ఈజీగానే దక్కేస్తుంది. మరి.. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.