తెలుగులో అమలాపాల్ మెరిసింది తక్కువే. రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగచైతన్య లాంటి హీరోలతో జట్టు కట్టినా అమలాపాల్‌కి పెద్దగా కలిసొచ్చింది లేదు. తమిళ, మలయాళ భాషల్లో మాత్రం అమలాపాల్‌కి ఇప్పటికీ డిమాండ్ ఉంది.
దర్శకుడు విజయ్‌తో పెళ్లి పెటాకులయ్యాక సినిమాలపై మరింత శ్రద్ద పెట్టింది అమలాపాల్. ఇప్పుడు టాలీవుడ్‌పైనా ఫోకస్పెంచింది. తాజాగా అమలాపాల్ కి ఇటునుంచి కూడా అవకాశాలు వెళ్తున్నట్టు టాక్. నరేష్ కథానాయకుడిగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అలా ఎలాతో దర్శకుడిగా తనని తాను నిరూపించుకొన్నాడు అనీష్. ఇప్పుడు ఓ మలయాళీ చిత్రాన్ని నరేష్ కోసం రీమేక్ చేస్తున్నాడు. స్క్రిప్టు వర్క్ పూర్తయ్యింది. డిసెంబరులో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో కథానాయికగా అమలాపాల్ అయితే బాగుంటుందని చిత్రబృందం భావించింది. అమలతో సంప్రదింపులు కూడా జరుపుతోంది. ఒకట్రెండు రోజుల్లో స్పష్టమైన సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది. నరేష్ పరిస్థితేం బాలేదు. వరుసగా ఫ్లాపులు చుట్టుముడుతున్నాయి. నరేష్ సినిమా అంటే కథానాయికలు కూడా భయపడే పరిస్థితి వచ్చింది. అందుకే టాలీవుడ్ అంతా వెదికీ వెదికీ.. చివరికి అమలాపాల్ దగ్గరకు వెళ్లింది చిత్రబృందం. నరేష్ నటిస్తున్న ఇంట్లో దెయ్యం నాకేం భయం త్వరలోనే విడుదల కాబోతోంది.