సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు మురుగదాస్‌తో చేస్తున్న సినిమాకే ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. కానీ సినిమా స్టార్ట్ అవకముందు నుంచే చాలా పేర్లు వినిపించాయి. వాటిల్లో కొన్ని టైటిల్స్‌ని మురుగదాస్ ఖండించేశాడు కూడా. ఇప్పుడిక మహేష్‌బాబు-కొరటాల సినిమాకు సంబంధించి కూడా బోలెడన్ని వార్తలు పుట్టుకొస్తున్నాయి. మహేష్‌తో చేయబోయే సినిమాలో బాలకృష్ణలాంటి సీనియర్ హీరోకు కూడా కీ రోల్ ఉంటుందన్న వార్తలను ఆల్రెడీ ఖండించేశాడు కొరటాల.
అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అంటూ ఓ వార్త బయటకు వచ్చింది. ‘భరత్ అను నేను..’ అన్న ఆ టైటిల్‌పైన కొరటాల స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి. కొరటాల శివ ఇంతకుముందు చేసిన సినిమాలన్నీ కూడా ఏదో ఒక సోషల్ మెస్సేజ్‌ని టచ్ చేసినవే. ఇప్పుడు మహేష్‌తో చేయబోతున్న సినిమాలో కూడా మహేష్‌బాబు ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని చెప్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయి పదవులను అలంకరించేవారెవరైనా తన పేరు చెప్పి…..‘అను నేను…’ అన్న ప్రమాణపత్రం చదువుతారన్న విషయం మనకు తెలిసిందే. సో….కొరటాల సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించడం ఖాయమైతే మాత్రం ఈ ‘భరత్ అను నేను’ అనే టైటిల్ ఫైనల్ అవడానకి కూడా అవకాశాలున్నట్టే కనిపిస్తోంది.