మహేష్‌బాబు పిల్లలపై తనకున్న ప్రేమని మరోసారి చాటుకొన్నాడు. దీపావళి సందర్భంగా 2500 పిల్లలకు గిఫ్ట్ బాక్సులు పంపి.. ఆశ్యర్యపరిచాడు. మహేష్ కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసింది. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. కొన్నిసన్నివేశాల కోసం భాష్యం స్కూల్‌కి చెందిన 2,500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్లతో రెండు రోజుల పాటు షూటింగ్ చేసింది చిత్రబృందం. షూటింగ్లో పాల్గొన్న 2,500 మంది పిల్లలకు చాక్లెట్స్, సాఫ్ట్ డ్రింక్స్‌తో కూడిన బాక్స్‌లను దీపావళి రోజున పంపించాడు మహేష్. పిల్లలందరూ మహేష్‌తో దిగిన ఫోటోను ఆ బాక్స్‌పై ప్రింట్ చేశారు. షూటింగ్లో పాల్గొన్న పిల్లలందరికీ థాంక్స్ చెప్తూ మహేష్ స్వయంగా సంతకం చేసిన థాంక్స్ కార్డ్ కూడా జత చేశారు. ఊహించని గిఫ్ట్‌తో భాష్యం స్కూల్ పిల్లలు షాకయ్యారు.
అన్నట్టు దీపావళికి మహేష్ కొత్త సినిమా టీజర్, టైటిల్ బయటకు వస్తాయని అంతా ఆశించారు. కానీ.. మహేష్ నుంచి ఎలాంటి గిఫ్ట్ రాలేదు. టైటిల్ విషయంలో ఇంకా ఓ క్లారిటీ లేకపోవడంతోనే ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేయలేదని తెలుస్తోంది. ఏజెంట్ శివ అనే పేరు దాదాపుగా ఖాయమైపోయిందని, అయితే… మహేష్ ఎందుకనో… బెటర్ ఆప్షన్ కోసం ఎదురుచూస్తున్నాడని టాక్. టైటిల్ ఎప్పుడైతే ఖాయమైందో అప్పుడే మోషన్ పోస్టర్ని కూడా విడుదల చేస్తారని చెప్పుకొంటున్నారు. డిసెంబరు నాటికల్లా షూటింగ్ పూర్తి చేయాలని మహేష్ లక్ష్యంగా పెట్టుకొన్నాడట. అందుకే నిరవధికంగా షూటింగ్ సాగుతోంది.