వరుస ఫ్లాపులతో తన ఇమేజ్‌కి డామేజ్ తెచ్చుకొన్నాడు సునీల్. ఈడు గోల్డెహె సినిమా తీవ్ర పరాభవంతో నిర్మాతల్లో ఉన్న నమ్మాకాన్ని కోల్పోయాడు సునీల్. అందుకే చేతిలో ఉన్న సినిమాలూ జారుకొంటున్నాయని చెప్పుకొన్నారు. మలయాళ చిత్రం టూ కంట్రీస్ సినిమాని సునీల్ తో తెరకెక్కిస్తున్నారు. ఎన్.శంకర్ ఆ చిత్రానికి దర్శకుడు. ఈడు గోల్డెహె అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఈసినిమా ఆగిపోయిందని, నిర్మాతలు మరో హీరో కోసం అన్వేషిస్తున్నారని ప్రచారం జరిగింది. ఎప్పుడో కొబ్బరికాయ కొట్టుకొన్న ఈ సినిమా ఎంతకీ పట్టాలెక్కకపోవడంతో అది నిజమే అనుకొన్నారంతా. అయితే.. ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ వచ్చింది. ఈనెల 7న చిత్రీకరణ ప్రారంభిస్తామని చిత్రబృందం ప్రకటించింది. దాంతో సునీల్ ఊపిరి పీల్చుకొన్నాడు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత ఎన్.శంకర్ మాట్లాడుతూ – ”మలయాళంలో టు కంట్రీస్ సినిమా చూడగానే బాగా నచ్చింది. సునీల్ యాప్ట్ అవుతుందనిపించి రీమేక్ చేయాలని నిర్ణయించుకొన్నాం. వినోదం తో పాటుగా అన్నీ ఎమోషన్స్ ఉంటాయి. ఈ పాత్ర సునీల్ తప్ప ఎవరూ చేయలేరు. నాకూ సునీల్‌కీ ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుంద”న్నారు. మాతృకకు సంగీతం అందించిన గోపీసుందర్ తెలుగులో సంగీతాన్ని అందిస్తున్నారు. 70 శాతం సినిమా అమెరికాలోనే చిత్రీకరిస్తారట. కథానాయిక ఎవరన్నది త్వరలో చెబుతారు. సో… ఆగిందనుకొన్న సినిమా పట్టాలెక్కుతుంది. మరి ఫలితం ఎలా ఉంటుందో??