30 ఇయర్స్ ఫృథ్వీ వెండి తెరపై చెలరేగిపోతున్నాడు. బ్రహ్మానందంకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అవ్వడం, ఎమ్మెస్ సత్యనారాయణ లాంటి కమెడియన్లను తెలుగు చిత్రసీమ దూరం చేసుకోవడంతో ఫృద్వీ ఇప్పుడు రాజ్యం ఏలుతున్నాడు. ఫృద్వీ క్యారెక్టర్ అంటే దాదాపుగా అది స్నూఫే. ఏదో ఓ హిట్ సినిమాలోని సన్నివేశాల్ని, క్యారెక్టర్ని పేరడీ చేసి, నవ్వించేస్తున్నాడు. థియేటర్లో ఉన్నంత వరకూ కాలక్షేపానికి ఢోకా లేకుండా చేస్తుంటాడు. అయితే ఈ పేరడీలు ఎక్కువైపోవడం, మరీ ముఖ్యంగా బాలకృష్ణ క్యారెక్టర్లనీ, ఆయన డైలాగుల్నీ కామెడీ కోసం వాడుకోవడం నందమూరి ఫ్యాన్స్‌కి నచ్చలేదు. ఈ విషయమై… వాళ్లంతా వార్నింగ్ ఇచ్చారు కూడా. దాంతో ఫృథ్వీ తేరుకొని.. `ఇక మీదట బాలకృష్ణ పాత్రల జోలికి రాను.. క్షమించండి` అని వేడుకొన్నాడు. బాలయ్యని వదిలేశాడు గానీ… లేటెస్ట్గా ఎన్టీఆర్‌ని పట్టాడు.
ఫృద్వీ ఒకానొక హీరోగా నటిస్తున్న చిత్రం మీలో ఎవరు కోటీశ్వరుడు. ఇందులో ఫృద్వీ వేరియేషన్ స్టార్ వీరబాబుగా నటిస్తున్నాడు. పేరే కామెడీగా ఉంది కదా?? ఈ క్యారెక్టర్ని కూడా సినిమాలో ఎడా పెడా వాడేసుకొన్నట్టే కనిపిస్తుంది. ఫృద్వీకి పాటలూ, కొన్ని యాక్షన్ సీన్లూ ఇచ్చేశారు. ఓ సీన్లో జనతా గ్యారేజ్‌లో ఎన్టీఆర్‌ని ఇమిటేట్ చేశాడు కూడా. బాలయ్య ఫ్యాన్స్ హర్టవుతున్నారని.. ఎన్టీఆర్‌ని ఫాలో అయ్యాడన్నమాట. ఒకట్రెండు సినిమాలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా క్యాజువల్‌గానే తీసుకొంటారు. అదే శ్రుతి మించితే… వాళ్లూ వార్నింగులు ఇవ్వడానికి రెడీ. అయినా.. ఫృద్వీ ఎన్నాళ్లిలా స్నూఫులపై ఆధారపడతాడు. ఏదో ఓ హీరోని పేరడీ చేసుకొంటూ పోతే కామెడీగానే ఉంటుంది. కానీ.. తనదంటూ వర్జినాలిటీ మిస్ అవుతుంది. అలా మిస్ అయిన వాళ్లు ఎక్కువ కాలం పరిశ్రమలో నిలబడలేరు. ఈ విషయాన్ని ఫృద్వీ ఎంత త్వరగా తెలుసుకొంటే అంత మంచిది.