జాగ్వార్‌తో కాస్త ఝడిపించాడు నిఖిల్ గౌడ. ఆ సినిమా కి ఏకంగా రూ.70 కోట్లు ఖర్చు పెట్టారు. కథకే కోటి రూపాయలు సమర్పించుకొన్నారు. సౌండ్ పార్టీ కాబట్టి.. రూ.70 కోట్లు పెద్ద మేటర్ కాలేదు. తొలి సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా…. నిఖిల్ గౌడ రెండో సినిమా కి కూడా అదే రేంజులో ఖర్చు పెట్టడానికి కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సిద్దమైనట్టు టాక్. ఈసారి నిఖిల్ కోసం సురేందర్ రెడ్డిని దర్శకుడిగా తీసుకొన్నారని తెలుస్తోంది. బోయపాటి శ్రీను, త్రివిక్రమ్, కొరటాల శివ లాంటి స్టార్ డైరెక్టర్లతో కొద్ది రోజులుగా సంప్రదింపులు జరుపుతున్న కుమార స్వామి.. ఇప్పుడు సురేందర్ రెడ్డి దగ్గర లాక్ అయ్యాడట. సురేందర్ రెడ్డి చెప్పిన కథ కుమార స్వామికి నచ్చడంతో.. అడ్వాన్సు కూడా చేతి ఇచ్చేశాడని టాక్. ఈ సినిమాతో సురేందర్ రెడ్డి ఏకంగా రూ.10 కోట్ల పారితోషికాన్ని అందుకోనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ధృవ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు సూరి. ఆ వెంటనే ఈ ప్రాజెక్టుని సెట్స్‌పైకి తీసుకెళ్తాడట. రేసుగుర్రం లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చాక కూడా సురేందర్‌రెడ్డి పారితోషికం రూ.5 కోట్లు దాటలేదు. దానికి ఇప్పుడు డబుల్ ఇస్తున్నాడన్నమాట. జాగ్వార్ సినిమా అంతే. ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చి.. బడ్జెట్ పెంచేశారు. సేమ్ టూ సేమ్ ఇప్పుడూ అదే సీన్ రిపీట్ కానున్నదన్నమాట. మరి ఈసారి నిఖిల్ గౌడ ఏం చేస్తాడో చూడాలి.