కమల్ హాసన్, గౌతమిల బ్రేకప్…. చిత్రసీమలో హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడైతే గౌతమి బ్రేకప్ లెటర్ బయటకు వచ్చిందో… అప్పటి నుంచీ గౌతమిపై సానుభూతి పెరిగిపోయి.. ఈ వ్యవహారం మొత్తంలో శ్రుతిహాసన్ ని విలన్ గా చూపడం మొదలైంది. మరోవైపు ఈ విషయంలో కమల్ హాసన్ కూడా ఇప్పటి వరకూ ఎలాంటి కామెంట్ చేయకపోవడం విశేషం. ”గౌతమి తన నిర్ణయం తాను తీసుకొంది. ఇక చెప్పడాని ఏం లేదు” అంటూ కమల్ తనని సంప్రదించిన మీడియా ప్రతినిధులకు సుతిమెత్తగా సమాధానం చెబుతున్నాడట. ఇప్పుడు కమల్ కుమార్తె… ఈ మొత్తం ఎపిసోడ్లో కీలకమైన వ్యక్తి శ్రుతిహాసన్ స్పందించింది.
”మరొకరి వ్యక్తిగత విషయాల్లో నేను జోక్యం చేసుకోను. వాళ్ల నిర్ణయాలపై వ్యాఖ్యలు చేయడం నాకు ఇష్టం ఉండదు, నా తల్లిదండ్రులు, నా సోదరి అంటే నాకు గౌరవం, ప్రేమ. వాళ్లు తప్ప మరో విషయం నాకు అనవసరం” అంటూ క్లియర్ కట్‌గా ఓ స్టేట్ మెంట్ ఇచ్చింది శ్రుతి. బ్రేకప్‌కి తానే కారణమన్న పుకార్లపై శ్రుతి స్పందించడానికి ఇష్టపడడం లేదు. గౌతమి అంటే పరాయి వ్యక్తి అన్నట్టు… తనకు, తనకుటుంబానికీ ఎలాంటి సంబంధం లేదన్నట్టు చేతులు దులుపుకొందిప్పుడు. తన తండ్రితో 13 ఏళ్లు సహజీవనం చేసిన గౌతమి పరాయి వ్యక్తి ఎలా అవుతుంది? ”నేనూ కమల్ విడిపోతున్నాం” అని గౌతమి చెప్పింది. ఆ వ్యాఖ్య కమల్ జీవితానికీ సంబంధించినదే కదా? ఏ విషయమైనా బోల్డ్‌గా మాట్లాడడం ముక్కు సూటిగా వెళ్లడం కమల్‌కి అలవాటు. ఆ లక్షణాలే శ్రుతికీ వచ్చాయి. కానీ ఈ విషయంలో మాత్రం కప్పదాటు సమాధానాలు చెప్పడం ఆశ్చర్యపరిచే విషయమే.