టాలీవుడ్లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. నాగచైతన్య – సమంతల పెళ్లి ఫిక్సయ్యింది. అఖిల్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు. ప్రభాస్ పెళ్లి వచ్చే యేడాదే ఉండబోతోందని టాక్. ఇప్పుడు అనుష్క కూడా పెళ్లికి సిద్దమైనట్టు టాక్. వచ్చే యేడాది అనుష్క పెళ్లి చేసుకోబోతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. బెంగళూరుకి చెందిన ఓ రియల్ ఎస్టేటర్ వరుడని… ఈ పెళ్లి ఇంట్లోవాళ్లు నిర్ణయించేందేనని తెలుస్తోంది. అనుష్క చేతిలో బాహుబలి 2, భాగ్ మతి సినిమాలున్నాయి. భాగ్మతి మినహా మిగిలి సినిమాల చిత్రీకరణ పూర్తయినట్టే. భాగ్మతి కూడా ఫినిష్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని అనుష్క భావిస్తోందట. 2017 చివర్లో అనుష్క పెళ్లి కూతురుగా కనిపించడం ఖాయమని చెప్పుకొంటున్నారు.
అనుష్క ప్రేమలో పడిందని, ఓ నిర్మాతతో సన్నిహితంగా మెలుగుతోందని వార్తలొచ్చాయి. అంతకంటే ముందు ఇద్దరు ముగ్గురు కథానాయకులతో అనుష్కని లింకప్ చేసి మాట్లాడారు. ఓ హీరోతో అనుష్క పెళ్లి రహస్యంగా జరిగిపోయిందని కూడా గుసగుసలాడుకొన్నారు. అయితే అదంతా గాసిప్ కబుర్లే అని తేలిపోయింది. అనుష్క కూడా మెల్లిగా తన పెళ్లి మేటర్ బయటపెట్టే అవకాశాలున్నాయని సమాచారం. ఈమధ్య అనుష్క మీడియా ముందుకు రాలేదు. ఆ అవసరం, అవకాశం కూడా రాలేదు. సింగం 3 ప్రమోషన్ల కోసం అనుష్క ఇంటర్వ్యూలు ఇచ్చే అవకాశం ఉంది. ఆ సందర్భంగా పెళ్లి కబురు ఏమైనా చెబుతుందేమో చూడాలి.