పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా త్వరలో మొదలవ్వనుంది. ఈలోగా హీరో హీరోయిన్లను, మిగిలిన టెక్నీషియన్లనూ ఫిక్స్ చేసుకొనే పనిలో పడ్డాడు త్రివిక్రమ్. ఓ కథానాయికగా కీర్తి సురేష్‌ని ఎంచుకొన్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా దొరకేసింది. ఆ ఛాన్స్ అను ఇమ్మానుయేల్ కి దక్కింది. నాని కథానాయకుడిగా నటించిన మజ్నులో అను ఓ కథానాయికగా కనిపించింది. మరోవైపు గోపీచంద్ ఆక్సిజన్ సినిమాలోనూ సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు పవన్ తో నటించే బంపర్ ఆఫర్ వచ్చేసింది. ప్రస్తుతం కాటమరాయుడు షూటింగ్ లో బిజీగా ఉన్నాడు పవన్ కల్యాణ్. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ని ముగించుకోవాలని చూస్తున్నాడు. ఎందుకంటే కాటమరాయుడు షూటింగ్ పూర్తయ్యాకే త్రివిక్రమ్ సినిమా మొదలవుతుందట. అనిరుథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే మూడు పాటల్ని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. డిసెంబరులో చిత్రీకరణ మొదలవుతుందని చెప్పుకొన్నా… ఇప్పుడు ఆ అవకాశం లేదని సమాచారం. జనవరిలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలెడతారట.